/rtv/media/media_files/2025/03/20/TUWWKWaPJ1RrtuHi3qpX.jpg)
ఐపీఎల్ లోని కొన్ని రూల్స్ పై బీసీసీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చునని తెలిపింది. బంతిని రివర్స్ స్వింగ్ చేసే క్రమంలో పేసర్లు ఉమ్మిని బంతికి రాస్తుంటారు. కరోనా సమయం నుంచి దీనిపై ఐపీఎల్‌తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో నిషేధం విధించారు. తాజాగా ఈ నిషేధాన్ని తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. శనివారం ప్రారంభమయ్యే లీగ్‌కు ముందు ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సెంకడ్ ఇన్నింగ్స్ లో రెండు బంతులు వాడుకోవచ్చునని తెలిపింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను యథావిధిగా కొనసాగించింది. దీనిని బీసీసీఐ ఇప్పటికే 2027 వరకు పొడిగించింది.
#IPL2025#बीसीसीआई ने गुरुवार को आगामी आईपीएल 2025 में गेंद पर लार के इस्तेमाल पर प्रतिबंध हटा दिया. बोर्ड ने यह फैसला 10 टीमों के कप्तानों की सहमति के बाद लिया. आईसीसी ने कोरोना के दौरान गेंद को चमकाने के लिए उस पर लार लगाने पर प्रतिबंध लगा दिया था.#BCCI #Sports #cricket #IPL… pic.twitter.com/NPvDGIQclK
— Live New India (@livenewindia01) March 20, 2025
Also read : ముస్కాన్ కంటే డేంజర్ ... ప్రియుడితో కలిసి భర్తను లేపేసి సంచిలో
Also read : ధనశ్రీ వర్మకు రూ. 4.75 కోట్లు భరణం.. ఇంతకీ చాహల్ ఆస్తులెంత?