IPL 2025 రిటెన్షన్ లిస్ట్‌ రిలీజ్.. ఏ ఫ్రాంచైజీకి ఎవరంటే?

ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌ రిలీజ్ అయింది.

New Update
IPL 2025

ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌పై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఏ ఫ్రాంచైజీ ఏ క్రికెటర్‌ను తమ వద్ద అంటిపెట్టుకుంటుంది.. మెగా వేలానికి ఏ ఆటగాడు వస్తాడు అనేది తేలిపోయింది. ఆర్సీబీ కోహ్లీని రిటైన్ చేసుకుంది.. అలాగే సీఎస్కే ధోనీని, ముంబై రోహిత్‌ను రిటైన్ చేసుకుంది. ఇంకా కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల పేర్ల లిస్ట్‌ను రిలీజ్ చేశాయి.

ఇది కూడా చదవండి: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం 

ముంబయి ఇండియన్స్‌

జస్‌ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు) 
రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
తిలక్ వర్మ (రూ.8 కోట్లు)

ఇది కూడా చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్‌ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్!

చెన్నై సూపర్ కింగ్స్‌

రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)
మతిశ పతిరన (రూ.13 కోట్లు)
శివమ్ దూబె (రూ.12 కోట్లు)
రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)
మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు)

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు

ఇది కూడా చదవండి: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?

విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
యశ్‌ దయాళ్‌ (రూ.5 కోట్లు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 

హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు) 
అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
నితీశ్‌ రెడ్డి (రూ.6 కోట్లు)
ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)

రాజస్థాన్ రాయల్స్‌ 

ఇది కూడా చదవండి: దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి

సంజు శాంసన్ (రూ.18 కోట్లు)
యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు) 
రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు) 
ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు) 
హెట్‌మయర్‌ (రూ.11 కోట్లు) 
సందీప్ శర్మ (రూ.4 కోట్లు)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment