బీసీసీఐ బిగ్ ప్లాన్.. గ్రాండ్ గా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. వచ్చే సెలబ్రిటీలు వీళ్లే!

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో మెగా సీజన్ ప్రారంభం కానుంది. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ నటి దిశా పటానీ, స్టా్ర్ సింగర్ శ్రేయ ఘోషల్, పంజాబీ సంచలనం కరణ్ ఆజ్లా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 

New Update
ipl 2025 opening

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ టోర్నమెంట్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒకటి. ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది.  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో మెగా సీజన్ ప్రారంభం కానుంది . ఇందులో పది జట్లు పోటీ పడుతున్నాయి. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ నటి దిశా పటానీ, స్టా్ర్ సింగర్ శ్రేయ ఘోషల్, పంజాబీ సంచలనం కరణ్ ఆజ్లా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 

ఈడెన్ గార్డెన్స్‌కు వెళ్లలేని వారు స్టార్ స్పోర్ట్స్: స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 HD, స్టార్ స్పోర్ట్స్ 2 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 2 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ ఖేల్, స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ లో చూడవచ్చు. ఈ వేడుకకు టిక్కెట్లు సీటింగ్  రూ. 3,000 నుండి రూ. 30,000 వరకు ఉంటుంది. సీటుంగ్ ను భట్టి రేటు మారుతుంది.  

ఈ యాప్స్ ద్వారా టికెట్లు

BookMyShow, Paytm Insider ,TicketGenie  వంటి యాప్స్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు.  ఈ వేడుక తర్వాత, టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ దేశంలోని 13 నగరాల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.  ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది.

Advertisment
Advertisment
Advertisment