/rtv/media/media_files/2025/03/17/15iF3nuWzBUPxcKfhTAo.jpg)
IPL Photograph: (IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య జరగనుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టులోని కీలక ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంతో లీగ్‌కి దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టు ఇతని స్థానంలో ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ సకారియా వచ్చాడు. అయితే ఈ విషయాన్ని కేకేఆర్ జట్టు స్వయంగా ప్రకటించింది. ఉమ్రాన్ మాలిక్ గతంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడగా.. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి వచ్చాడు. కానీ గాయం కారణం చేత దూరమయ్యాడు.
ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
CHETAN SAKARIYA HAS REPLACED UMRAN MALIK IN KKR. ⭐ pic.twitter.com/MiWBfRz29p
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 16, 2025
చేతన్ సకారియా భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అతను ఒక వన్డే, రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 19 మ్యాచ్‌లలో 20 వికెట్లు పడగొట్టాడు. సకారియాను కేకేఆర్ రూ.75లక్షలకు జట్టులోకి తీసుకుంది. అయితే మొదట ఐపీఎల్-2025 వేలంలో చేతన్‌ను ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. కేకేఆర్ జట్టులో నెట్ బౌలర్‌గా చేరాడు. ఇప్పుడు ఇమ్రాన్ మాలిక్ స్థానంలో కేకేఆర్ అతనిని జట్టులోకి తీసుకుంది.
ఇది కూడా చూడండి: PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
కేకేఆర్ తుది జట్టు అంచనా
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్ట్జే/స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి.
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?