మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్‌ పై హార్దిక్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌ పై హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. తాను, రోహిత్‌, బుమ్రా, సూర్య, తిలక్‌  ఒక చేతికి ఉన్న ఐదు వేళ్ల లాంటి వాళ్లమన్నాడు. ఒకే పిడికిలిలా కలిసి ఉంటూ మరింత బలంగా తిరిగొస్తామన్నాడు.

New Update
dk

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ రిటెన్షన్‌ పై ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్‌ శర్మ, బుమ్రా, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మను ముంబై అంటిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా తాము అయిదుగురం ఒక చేతికి ఉన్న ఐదు వేళ్ల లాంటి వాళ్లమని హర్దీక్ అన్నాడు. అంతేకాదు ఎప్పటికీ తాము ఒకే పిడికిలిలా కలిసి ఉంటామంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో  తన మనసులో మాట బయటపెట్టాడు. 

ఇది నిజంగా గొప్ప నిర్ణయం..

‘మళ్లీ ముంబైకి ఆడే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా గొప్ప నిర్ణయం. నా జీవితంలో నేను సాధించినవన్నీ ముంబై ఇండియన్స్‌లో భాగమే. ప్రతి సీజన్ ప్రత్యేకమే అయినా ఈసారి మరింత ఆనందంగా ఉంది. 2013, 2015, 2017, 2019, 2020లో మేం అయిదుగురం ముంబైకి ప్రాతినిధ్యం వహించాం. ఈ 2025 సీజన్ లో మరింత బలంగా తిరిగొస్తాం. మేము విభిన్నమైన వ్యక్తులమే.. కానీ మా అయిదుగురికి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మా మధ్య సోదరభావం, స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అంటూ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: త్వరలో ఆ చట్టం తీసుకొస్తాం.. పవన్ సంచలన ప్రకటన!

వారికి అధిక ప్రాధాన్యం దక్కాల్సిందే..

ఇక రిటెన్షన్‌ జాబితాపై రోహిత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ముంబై టీమ్ నిర్ణయం సరైనదే అన్నాడు. నేను టీ20 ఫార్మాట్‌కు  వీడ్కోలు పలికాను కాబట్టి.. నాకు 4వ స్థానం సరైనదే. జాతీయ జట్టులో కీలక స్థాయిలో ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం దక్కాల్సిందే. అదే నేను నమ్ముతా. జట్టు నిర్ణయంతో సంతోషంగానే ఉన్నానన్నాడు. రోహిత్‌ శర్మను ముంబై రూ.16.30 కోట్లకు జట్టు రిటైన్‌ చేసుకుంది. బుమ్రా రూ.18 కోట్లు, సూర్యకుమార్‌ రూ.16.35కోట్లు, పాండ్యా రూ.16.35 కోట్లు, తిలక్‌ వర్మను రూ.8 కోట్లకు అట్టిపెట్టుకుంది. మొత్తంగా రిటెన్షన్‌ కోసం రూ.75 కోట్లు వెచ్చించగా రూ.45 కోట్లతో వేలానికి వెళ్లనుంది.

ఇది కూడా చదవండి: Ind vs Nz: తిప్పేసిన స్పిన్నర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది. 

New Update
ipl

GT VS RR

గుజరాత్ ఇచ్చిన భారీ లక్ష్యం 217 పరుగులను సాధించడంలో సంజూ శాంసన్ టీమ్ తడబడింది.  దీంతో గుజరాత్ ఓటమన్నదే లేకుండా వరుసగా నాలుగో విజయ దక్కినట్టయింది. 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.  దీంతో 218 పరుగులతో ఆర్ఆర్ లక్ష్య ఛేదనకు దిగింది. కానీ 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. హెట్ మయర్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సెక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు బాదాడు. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 26 మెరుపులు మెరిపించాడు. అయితే మిగతా వారు సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోవడంతో మ్యాచ్ ను నిలబెట్టుకోలేకపోయారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా ఒక్కో వికెట్‌ తీశారు. 

అదరగొట్టిన సాయి సుదర్శన్..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగింది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెన్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 2 అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బట్లర్, సాయి సుదర్శన్ కలిపి పరుగుల వరద పారించారు.  గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. ఇతనితో పాటూ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు,  షారుక్ 20 బంతుల్లో 36 పరుగులు, తివాటి 12 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | gujarath | rajasthan

Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment