IPL 2025 Retention: ఐపీఎల్ 2025 అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే!

ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ విడుదల కాగా.. ఇందులో రూ.23 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ .21 కోట్లతో ఉన్నారు.

New Update
ipl 2025

IPL 2025 Retention: ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌‌ను నిన్న విడుదల చేశారు. అందరి కంటే ఎక్కువగా పంజాబ్ కింగ్స్ రూ. 110.5 కోట్లతో మెగా వేలానికి సిద్ధమవుతోంది. అయితే ఈ రిటెన్షన్‌లకు ముందు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌నను రూ.23 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ హైదరాబాద్ సంపాదించుకుంది. ఈ రిటెన్షన్‌లో హెన్రిచ్ క్లాసెన్ అత్యంత ఖరీదైన ఆటగాడు.

ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే

అత్యంత ఖరీదైన భారత ఆటగాడు..

కింగ్ విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.21 కోట్లతో సొంతం చేసుకుంది. రిటెన్షన్‌కు ముందు అత్యంత ఖరీదైన ఆటగాడు విరాట్ కోహ్లీనే. ఐపీఎల్ 2025 రిటెన్షన్‌కి ముందు వీరిద్దరే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు. హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లతో టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ రూ. 21 కోట్లు , నికోలస్ పూరన్ రూ.21 కోట్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, పాట్ కమిన్స్, రషీద్ ఖాన్ రూ.18 కోట్లు, అక్సర్ పటేల్, శుభమన్ గిల్ రూ 16.5 కోట్లతో ఖరీదైన ఆటగాళ్లగా నిలిచారు. 

ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) - రూ. 51 కోట్లు
రిటెన్షన్స్: సునీల్ నరైన్ (12), రింకూ సింగ్ (13), ఆండ్రీ రస్సెల్ (12), వరుణ్ చకరవర్తి (12), హర్షిత్ రాణా (4), రమణదీప్ సింగ్ (4).

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్ ) - 45 కోట్లు
రిటెన్షన్స్: హెన్రిచ్ క్లాసెన్ (23), పాట్ కమిన్స్ (18), ట్రావిస్ హెడ్ (14), అభిషేక్ శర్మ (14), నితీష్ కుమార్ రెడ్డి (6).

రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) - రూ. 41 కోట్లు
రిటెన్షన్స్: సంజు శాంసన్ (18), రియాన్ పరాగ్ (14), యశస్వి జైస్వాల్ (18), సందీప్ శర్మ (4), ధ్రువ్ జురెల్ (14), షిమ్రోన్ హెట్మెయర్ (11).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) - రూ. 83 కోట్లు
రిటెన్షన్స్: విరాట్ కోహ్లీ (21), రజత్ పటీదార్ (11), యశ్ దయాల్ (5).

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) - రూ. 55 కోట్లు
రిటెన్షన్లు: రుతురాజ్ గైక్వాడ్ (18), ఎంఎస్ ధోని (4), రవీంద్ర జడేజా (18), శివమ్ దూబే (12), మతీషా పతిరానా (13).

ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్‌ బిగ్ ప్లాన్!

లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) - రూ.69 కోట్లు
రిటెన్షన్స్: నికోలస్ పూరన్ (21), మయాంక్ యాదవ్ (11), రవి బిష్ణోయ్ (4), మొహ్సిన్ ఖాన్ (4), ఆయుష్ బదోని (4).

గుజరాత్ టైటాన్స్ (జీటీ) - రూ.69 కోట్లు
రిటెన్షన్స్: రషీద్ ఖాన్ (18), శుభమన్ గిల్ (16.5), సాయి సుదర్శన్ (8.5), రాహుల్ తెవాటియా (4), షారుక్ ఖాన్ (4).

ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) - రూ. 73 కోట్లు
రిటెన్షన్స్: అక్షర్ పటేల్ (16.5), అభిషేక్ పోరెల్ (4), ట్రిస్టన్ స్టబ్స్ (10), కుల్దీప్ యాదవ్ (13.5)

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) - రూ. 110.5 కోట్లు
రిటెన్షన్స్: శశాంక్ సింగ్ (5.5), ప్రభసిమ్రాన్ సింగ్ (4).

ముంబై ఇండియన్స్ (ఎంఐ) - రూ. 45 కోట్లు
రిటెన్షన్స్: రోహిత్ శర్మ (16.3), జస్ప్రీత్ బుమ్రా (18), సూర్యకుమార్ యాదవ్ (16.35), తిలక్ వర్మ (8), హార్దిక్ పాండ్యా (16.35).

ఇది కూడా చదవండి: ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS DC: ఈ సాలాకప్ నమ్దే..ఢిల్లీపై విజయం..అగ్రస్థానానికి ఆర్సీబీ

ఐపీఎల్ లో ఈరోజు ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఇచ్చిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో ఛేదించింది. 

New Update
ipl

RCB VS DC

విరాట్ కోహ్లీ మళ్ళీ గర్జించాడు. యంగ్ స్లేయర్ కృనాల్ విజృంభించాడు. దీంతో ఢిల్లీ చేతులెత్తేసింది. ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అద్బుత విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కాస్త టెన్షన్ పెట్టింది. కానీ ఓపెనర్ గా వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ జట్టును నిలబెట్టాడు. అలాగే నాలుగు స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కృనాల్ విజృంభించేశాడు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ వశమైంది. కృనాల్‌ పాండ్య (73*), విరాట్‌ కోహ్లీ (51) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో వరుసగా మూడు మ్యాచ్ లను గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్ళింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు తీశాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని..

ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు మంచి ఫామ్ అందించారు. అభిషేక్‌ పోరెల్‌, డుప్లెసిస్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఓపెనర్ అభిషేక్‌ పోరెల్‌ క్రీజులో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పోరెల్‌ (28) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణ్ నాయర్ మరుసటి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. నాయర్‌ (4) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు సాధించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, డుప్లెసిస్ మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టారు. ఆచితూచి ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. డుప్లెసిస్‌ (22) ఔట్‌ అయ్యాడు. కృనాల్‌ పాండ్య వేసిన 9.5 ఓవర్‌లో విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ స్కోర్ అనే చెప్పాలి. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది.

today-latest-news-in-telugu | IPL 2025 | dc vs rcb | match 

Also Read: India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

Advertisment
Advertisment
Advertisment