/rtv/media/media_files/2025/03/09/tgZ86y107hOIm2dEU7Ok.jpg)
INDIA WON
మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా సొంతం అయింది. బాగా భయపెట్టినా కప్ ను మాత్రం టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. రోహిత్ తరువాత వచ్చిన బ్యటార్లు అందరూ వరుసగా వికెట్లు పోగొట్టుకోవడంతో మ్యాచ్ ఓడిపోతారేమో అనుకున్నారు అందరూ. కానీ నెమ్మదిగా ఆడుతూ కివీస్ ఇచ్చిన 252 లక్ష్యాన్ని చేరుకుంది భారత జట్టు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో బ్యాటర్లకు కాస్త కష్టంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసినవాళ్ళకు కాస్త బాగానే ఉన్నా...లక్ష్య ఛేదనకు వచ్చిన ఇండియాకు మాత్రం చాలా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. స్పిన్ బాగా తిరుగుతుండడంతో భారత బ్యాటర్లు ఆడటం ఇబ్బంది అయింది. పరుగులు రాబట్టకోవడం మాట అటుంచి...వికెట్ ను కాపాడుకోవడమే పెద్ద పని అయిపోయింది. కానీ మొత్తానికి భారత బ్యాటర్లు ఎలా అయితేనేం నెమ్మదిగా లక్ష్యాన్ని సాధించారు. మ్యాచ్ ను గెలిచి...కప్ ను సొంతం చేసుకున్నారు.
సమిష్టి విజయం..
రోహిత్ హాఫ్ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు...చివర్లో కే ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ఎగురేసుకుపోయింది. న్యూజిలాండ్ ఇచ్చిన 252 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు, ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమ్ఇండియా. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($ 2.24 మిలియన్లు) లభిస్తాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 76 రన్స్‌తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయినప్పటికీ.. శ్రేయస్ అయ్యర్ (48) మాత్రం మెరిశాడు. చివర్లో కేఎల్ రాహుల్ ఎప్పటిలానే గోడలా నిలబడి 32 పరుగులతో మ్యాచ్ ను భారత్ కు అందించాడు.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. 18 ఓవర్ల వరకు ఇద్దరూ దూకుడుగా ఆడారు. శాంట్నర్ వేసిన 18.4 ఓవర్‌కు గ్లెన్ ఫిలిప్స్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ అందుకోవడంతో 31 పరుగులతో శుభ్‌మన్ గిల్ అవుట్అ అయ్యాడు.తరువాత వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగుతోనే బ్రాస్‌వెల్ వేసిన 19.1 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. రచిన్ రవీంద్ర వేసిన ఓవర్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ స్టంపౌటయ్యాడు. తరువాత రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 రన్స్ పూర్తి చేసుకున్నాడు. తరువాత మ్యాచ్ ను శ్రేయస్ అయ్యర్ తన భుజాల మీద మోసాడనే చెప్పవచ్చును. కానీ కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్ 48 పరుగుల దగ్గర ఔట్ అయి హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీని తరువాత మ్యాచ్ కొంచెం ప్రెజర్ లో పడింది. కాస్త నిలబడకపోతే కష్టం అనే పరిస్థితికి వచ్చింది. కానీ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాల మెరుపుల బౌండరీలతో కాన్ఫిడెన్ ను తెచ్చారు. అక్షర్ 29 పరుగులు.. హార్దిక్ పాండ్యా 18 పరుగులతో స్కోరును పరుగులు పెట్టించారు. తరువాత వచ్చిన కేఎల్ రాహుల్ 32 పరుగులు చేయగా,..చివరగా వచ్చిన జడెజా 5 పరుగులతో భారత్‌ను గెలిపించారు.