/rtv/media/media_files/2026/02/15/india-won-the-match-2026-02-15-22-27-16.jpg)
India Won the Match
కొలంబో వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 18 ఓవర్లలో 114 పరుగులకే పాక్‌ను ఆలౌట్ చేసింది. 61 పరుగుల తేడాతో దాయాదిని కట్టడి చేసింది.176 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో సైమ్ అయూబ్‌వికెట్ కూడా ఔటైపోయాడు. దీంతో 6 పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడిపోతూ వచ్చాయి.
Also Read: ఇరగదీసిన కిషాన్.. గిల్, గంభీర్ రికార్డులు బద్దలు!
మరోవైపు పాకిస్థాన్‌కు ఇషాన్ కిషన్ చుక్కలు చూపించారు. 20 ఓవర్లలో 5 వికెట్లకు భారత్ 175 పరుగులు చేసింది. 40 బంతుల్లోనే ఇషాన్ కిషన్ 77 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ 31, శివం దూబే 27, తిలక్ వర్మ 25 పరుగులతో రాణించారు. బుమ్రా, అక్షర్, వరుణ్, హర్డిక్ తలో వికెట్లు తీశారు. కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. వరుసగా మూడుసార్లు గెలవడంతో ఇండియా సూపర్ 8కి చేరింది.
Well played #TeamIndia 👏
— Amit Shah (@AmitShah) February 15, 2026
Formats, places, and dates may change, but the result of #IndvsPak remains consistent.
Congratulations to the entire team.#T20WorldCuppic.twitter.com/K10UPQgZ8n
Follow Us