Women's T20 World Cup: మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ భారత జట్టు ప్రకటన.. ఈసారి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ జూన్‌ 12న ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును శనివారం ప్రకటించారు. ఈసారి మహిళా వరల్డ్‌ కప్‌నకు ICC రూ.82 కోట్ల ప్రైజ్‌మనీని కేటాయించింది.

New Update
India Women's T20 World Cup squad announcement

India Women's T20 World Cup squad announcement

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ జూన్‌ 12న ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును శనివారం ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. BCCI సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా, ప్రధాన కోచ్ అమోల్‌ మజుందార్‌ తదితరులతో సమావేశమైంది. అనంతరం మహిళల టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించారు. 

మహిళల టీమిండియా జట్టు సభ్యులు 

1.హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్)
2. స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)
3. షెఫాలీ వర్మ
4.జెమీమా రోడ్రిగ్స్
5. భారతి పుల్మాలి
 6.అరుంధతి రెడ్డి
7. రేణుకాసింగ్ ఠాకూర్
8. క్రాంతి గౌడ్
 9.శ్రేయాంక పాటిల్
10. రాధా యాదవ్
 11.దీప్తి శర్మ
12. రిచా ఘోష్‌
13. శ్రీచరణి
 14.యాస్తికా భాటియా
 15.నందిని శర్మ

Also Read: బాత్‌రూమ్‌లో మహిళల వీడియోలు తీసి.. ఇద్దరు క్రికెటర్లు అరెస్ట్!

ఈ T20 వరల్డ్‌కప్‌లో మొత్తం 12 టీమ్‌లు ఉన్నాయి. గ్రూప్‌- Aలో ఉన్న భారత్‌ లీగ్‌ దశలో మొదటి మ్యాచ్‌ జూన్‌ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్‌, 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. గ్రూప్- Bలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 30న మొదటి సెమీస్, జులై 2న రెండో సెమీస్ కెన్నింగ్టన్ ఓవల్, లండన్‌లో నిర్వహించనున్నారు. జులై 5న జరిగే ఫైనల్స్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. 

ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా ?

ఈసారి మహిళా వరల్డ్‌ కప్‌నకు ICC రూ.82 కోట్ల ప్రైజ్‌మనీని కేటాయించింది. గత టోర్నీలో ఇచ్చిన దానికన్నా ఇది పది శాతం ఎక్కువ. ఇందులో విజేతగా గెలిచిన టీమ్‌కు రూ.21.8 కోట్ల ప్రైజ్‌మనీ వస్తుంది. రన్నరప్‌ టీమ్‌కు రూ.10 కోట్లు లభిస్తాయి. అలాగే సెమీస్‌లో ఓడిన జట్లకు రూ.6.29 కోట్ల చొప్పున వస్తాయి. ఒక్కో గ్రూప్‌ మ్యాచ్‌ విజయానికి కూడా రూ.29 లక్షల చొప్పున అందిస్తారు. దీంతో ఈ వరల్డ్‌ కప్‌లో ఆడే 12 జట్లకు కనీసం రూ.2.06 కోట్లు దక్కనున్నాయి. 

Advertisment
తాజా కథనాలు