/rtv/media/media_files/2025/02/07/PhfrPgqax9nS5xoxnpkc.jpg)
Team India Former pacer Zaheer Khan praises Shreyas Iyer
భారత్ - ఇంగ్లాండ్ మధ్య నిన్న (గురువారం) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ బ్యాటర్లు శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో దుమ్ము దులిపేశారు. అయితే విరాట్ కోహ్లీ మోకాలికి గాయం కావడంతో.. అతడి ప్లేస్‌లో శ్రేయస్ వచ్చి అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు.
ఇది కూడా చూడండి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
శ్రేయస్ హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా భారత్ ప్లేయర్లకు మంచి ఊపునిచ్చాడు. ఫోర్లు, సిక్లర్లతో ఫుల్ జోష్ నింపాడు. అప్పటికే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ అతి తక్కువ సమయంలోనే ఔటయ్యారు. దీంతో భారత్‌కు విజయం కష్టం అవుతుందని అంతా భావించారు.
కానీ క్రీజ్‌లో ఉన్న శ్రేయస్, గిల్ అందరిలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అయితే శ్రేయస్ అయ్యర్ ఆటపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించారు. మ్యాచ్‌లో శ్రేయస్ ఆత్మవిశ్వాసం అద్భుతమని అన్నారు. అతడు నెక్స్ట్ మ్యాచుల్లోనూ ఇలాగే కొనసాగిస్తే భాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కర శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ గురించే మాట్లాడుతున్నారన్నారు.
ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
శ్రేయస్ ఆట అదుర్స్
అతడు ఎదురుదాడి చేసిన తీరు అద్భుతమని చెప్పుకొచ్చారు. అప్పటికే టీమిండియా 2 వికెట్లు కోల్పోయిందని.. ఆ సమయంలో క్రీజులో ఎవరున్నా కాస్త నెమ్మదిగా ఆదేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. కానీ శ్రేయస్ కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం అద్భుతంగా ఉండటంతో ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించి అదరగొట్టేశాడని అన్నారు. పిచ్ నుంచి బౌలర్లకు కాస్త సహకారం లభిస్తోన్నపుడు లక్ష్య ఛేదన విషయంలో తాము వెనకడుగు వేసేదే లేదంటూ శ్రేయస్ ముందుకు దూసుకెళ్లాడని అన్నారు. అందుకే మంచి ఫాంలో ఉన్న బ్యాటర్‌ను పక్కన పెట్టడం మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
మరో సమస్య
అయితే రెండో వన్డే మ్యాచ్‌లో శ్రేయస్ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు భారత మేనేజ్‌మెంట్ ఎదుట మరో సమస్య తలెత్తినట్లు సమాచారం. ఎందుకంటే మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన విరాట్.. ఇప్పుడు రెండో వన్డేకు రానున్నాడు. దీంతో ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెడతారా? లేక మరెదైనా ప్రత్యమ్నాయం ఆలోచిస్తారా? చూడాలి.