T20 Womens World Cup : పాక్ ఓటమి.. ఇండియా ప్రపంచ కప్ ఆశలు ఆవిరి యూఏఈ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్‌లో నిన్న పాకిస్థాన్‌ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడంతో భారత్ సెమీస్‌కు చేరే అవకాశం పోయింది. దీంతో మహిళల ప్రపంచ కప్ ఆశలు ఆవిరి అయిపోయినట్లే. By Kusuma 15 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహిళల టీ20 ప్రపంచ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం గ్రూప్ దశలో జరుగుతున్న మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఓటమి పాలయ్యింది. మొత్తం నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించగా.. రెండు ఓటమి పాలయ్యాయి. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. ఇది కూడా చూడండి: నేడు కొత్త టీచర్లకు పోస్టింగులు సెమీస్ ఆశలు గాల్లోకి.. ఇక సెమీస్ చేరే అవకాశాలు కష్టమే అనుకున్నారు. నిన్న న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే భారత్‌కు సెమీస్ అవకాశాలు ఉన్నట్లే. కానీ ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలయ్యింది. న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు గాల్లో కలిసిపోయాయి. ఇది కూడా చూడండి: Kidnap: మద్యం దుకాణం లాటరీ వచ్చిందనుకునే లోపే ...కిడ్నాప్ అయ్యాడు! ఈ మ్యాచ్ పాక్‌కి ఎంత కీలకమో.. భారత్‌కి అంతే ముఖ్యం. కానీ ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడంతో టీమిండియా సెమీస్ నుంచి తప్పుకుంది. ఆస్ట్రేలియా జట్టు నేరుగా సెమీస్‌కి చేరుకుంది. ఇక భారత్ ప్రపంచ్ ఆశలు ఈసారిక ఆవిరి అయినట్లే. న్యూజిలాండ్ 2016 తర్వాత మళ్లీ సెమీస్‌కు వెళ్తోంది. సెమీస్‌కు అర్హత సాధించేందుకు పాకిస్థాన్ 12 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించాలి. కానీ 11.4 ఓవర్లలో 56 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్ అయ్యింది. ఇది కూడా చూడండి: AP: ఆర్టీసీ బస్సు బోల్తా.. వృద్ధురాలు మృతి న్యూజిలాండ్ బౌలర్ అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్టగా, ఈడెన్ కార్సన్ రెండు, లీ తహుహు ఒక వికెట్ తీశారు. చెప్పుకోవాలంటే పాక్ టీమ్ కూడా న్యూజిలాండ్‌ను 110 పరుగుల దగ్గర కట్టడి చేసింది. కానీ బ్యాటింగ్‌లో ఘోరంగా ఓటమి పాలయ్యింది. 54 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించి సెమీస్‌కి చేరుకుంది. ఇది కూడా చూడండి: Ap Rains:బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు! #pakistan #india #team-india #t20-womens-world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి