/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) తుదిశ్వాస విడిచారు. ఇవాళ USలో ఆయన కన్నుమూశారు. 1967-1975 వరకు ఆయన భారత జట్టుకు ఎన్నో విశిష్ట సేవలు అందించారు. అంతేకాకుండా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, మీడియం పేసర్ కూడా. 1971లో ఒవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
Syed Abid Ali
సయ్యద్ అబిద్ అలీ తన కెరీర్లో 29 టెస్టు మ్యాచ్లు ఆడి 47 వికెట్లు పడగొట్టారు. 1958-59లో హైదరాబాద్‌లో జూనియర్ టీం తరఫుర ఆడారు. ఆ తర్వాత ఏడాదిలో రంజీట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. అలా హైదరాబాద్ రంజీ టీంలో ఆడాడు. ఆ ఏడాదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు సెలెక్ట్ అయ్యాడు.
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
ఆ తర్వాత 1967-68లో భారత జట్టుకు ఎంపికై వెటౌడీ కెప్టెన్సీలో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడారు. ఆ మ్యాచ్‌లో 55 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అంతేకాకుండా ఒక్కడే 6 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అలా ఆయన తన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించాడు. అది మాత్రమే కాకుండా బెస్ట్ ఫీల్డర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!
అలాగే అబిద్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో 29 మ్యాచులు ఆడి 1,018 పరుగులు చేశాడు. 5 వన్డేల్లో 93 పరుగులు చేసి ఔరా అనిపించాడు. టెస్టుల్లో అత్యుత్తమ స్కోర్ 81, వన్డేల్లో 70గా నమోదు అయ్యాయి. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి దిగ్గజం మృతి చెందడంతో పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.