Champions Trophy 2025: రాహుల్‌ బ్యాటింగ్ ఆర్డర్‌పై కోచ్ సంచలన వ్యాఖ్యలు!

కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసించాడు. అతను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు మారడం జట్టు బలాన్ని మరింత పెంచుతుందన్నారు. పరిస్థితులకు తగ్గట్టు అతడు ఓపెనింగ్‌, 4, 5,6 స్థానాల్లో బ్యాటింగ్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు.

New Update
Sitanshu Kotak interesting comments on KL Rahul batting order in champions trophy 2025

Sitanshu Kotak interesting comments on KL Rahul batting order in champions trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్‌ మ్యాచ్ మార్చి 9న గ్రాండ్ లెవెల్లో జరగనుంది. భారత్ vs న్యూజిలాండ్ చివరాఖరి పోరుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టులో ఎక్కువ సార్లు ప్లేస్‌లు మారింది ఎవరన్నా ఉన్నారు అంటే అది కేఎల్ రాహుల్ మాత్రమే. జట్టుకు ఏ సమయంలో అతడు అవసరం అవుతాడో.. అప్పుడు ఒక యోధుడిలా తానునున్నానంటూ ముందుకొస్తాడు. 

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

ఓపెనింగ్, 3,4,5,6 స్థానంలో కూడా అతడు బ్యాటింగ్ చేస్తాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జట్టును ఓటమి ఊబిలోంచి బయటపడేశాడు. అతడి ఆటతీరుపై తాజాగా భారత్ బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ ప్రశంసలు కురిపించాడు. రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం జట్టు బలాన్ని మరింత పెంచిందన్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా అతడు బ్యాటింగ్ ఆర్డర్ మారడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. 

పరిస్థితులకు అనుగుణంగా రాహుల్

గతంలో రాహుల్ పరిస్థితులకు అనుగుణంగా ఓపెనింగ్ నుంచి 5వ స్థానం వరకు బ్యాటింగ్ చేశాడని.. ఇప్పుడు 6వ స్థానంలో బరిలోకి దిగుతున్నాడని.. అయితే అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా త్వరగానే అలవాటు పడతాడని కొనియాడాడు. అతడు తన పాత్ర పట్ల సంతోషంగా ఉంటాడు అని అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్‌కు దిగడం అతనికే మేలు చేస్తోందని చెప్పుకొచ్చాడు.

Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

అతడు అలా బ్యాటింగ్ స్థానాలకు దిగడం టీమిండియాకు సైతం ఎంతో ఉపయోగకరం అని అన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. టీమ్‌లో రోహిత్, కోహ్లీ, హార్దిక్, షమీ, జడేజా వంటి సీనియర్ ప్లేయర్లు ఉండటం వల్ల ఫైనల్ మ్యాచ్‌ ఒత్తిడిని తట్టుకోగలదని అతడు తెలిపాడు. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లు జట్టుకు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తుండటం ఎంతో మేలైన పద్దతి అని చెప్పుకొచ్చారు.

Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment