భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్

భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది. పగలు, రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఈ పింక్ మ్యాచ్‌కు వేదిక కానుంది.

New Update
Pink ball

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి మ్యాచ్ జరిగింది. ఈ మొదటి మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అయితే ఇప్పుడు రెండో మ్యాచ్‌ కోసం టీమిండియా అల్రెడీ ఆస్ట్రేలియా కూడా వెళ్లింది. డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమయ్యే ఈ రెండో టెస్టు మ్యాచ్‌ను అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను పింక్ బాల్ టెస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్ పగలు, రాత్రి జరగనుంది. ఇలా 24 గంటలు జరిగే ఈ మ్యాచ్‌లో రెడ్ బాల్‌ వాడకుండా పింక్ బాల్‌ను ఉపయోగిస్తారట. 

ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

మ్యాచ్ వివరాలు..

డిసెంబర్ 6న జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా తరపున రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. వ్యక్తిగత కారణాలు తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే హిట్ దేవదత్ పడిక్కల్‌ను తీసుకున్నారు. ఇప్పుడు రోహిత్ శర్మ ఉండటంతో అతన్ని తొలగించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య 2వ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది. అదే 3వ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు బ్రిస్బేన్‌లో, 4వ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్బోర్న్‌లో, 5వ టెస్ట్ మ్యాచ్ 2025 జనవరి 2  నుంచి 7 వరకు సిడ్నీలో జరగనున్నాయి. 

ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

భారత్ జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యస్సవి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, పర్దీష్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్.

ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్

ఆస్ట్రేలియా జట్టు

పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు.

New Update
KKR Vs PBKS sports

KKR Vs PBKS sports

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్, రస్సెల్‌ 1 వికెట్‌ తీశారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు మంచి ఆరంభం అందించింది. ప్రియాంశ్‌ ఆర్య, ప్రభు సిమ్రన్‌ సింగ్‌ ఓపెనర్లుగా వచ్చి అదరగొట్టేశారు. 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా దూకుడుగా ఆడిన ప్రియాంశ్‌ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 90 పరుగులు చేశారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఆ తర్వాత రస్సెల్‌ బౌలింగ్‌లో ప్రియాంశ్‌ ఆర్య (69) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్‌ సింగ్‌ దూకుడుగా ఆడాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (83) ఔట్‌ అయ్యాడు. అలా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (7), మార్కో యాన్సెన్‌ ఔట్, శ్రేయస్‌ అయ్యర్‌ 25* పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు రాబట్టారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

IPL 2025 | KKR VS PBKS | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment