/rtv/media/media_files/2025/02/12/Kq5fmICQ4CJN1sHNv6yw.jpg)
ind vs eng 3rd odi team india opener Shubman Gill 100 runs completed
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన గిల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 100 పరుగులు చేసి అందరిచేత సెల్యూట్ చేయించుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 95 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
ODI CENTURY NO.7 for @ShubmanGill 👏👏
— BCCI (@BCCI) February 12, 2025
A stroke filled innings from the vice-captain as he brings up a fine 💯
He's been in terrific form this series!#TeamIndia #INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/dnJq0IaLS3
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
శ్రేయస్ హాఫ్ సెంచరీ
శ్రేయస్ అయ్యర్ సైతం చెలరేగిపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఫస్ట్ నుంచి తన ఫామ్‌లో ఎలాంటి ఛేంజెస్ లేకుండా.. అద్భుతమైన ఆట తీరుతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు సెంచరీ వైపుగా వెళ్తున్నాడు.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
కోహ్లి హాఫ్ సెంచరీ
ఇదిలా ఉంటే ఈ మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సైతం అద్భుమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఎడ్జ్ కటింగ్‌లతో ఫోర్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఫామ్‌లో లేడని విమర్శించిన వారి నోర్లకు హాఫ్ సెంచరీతో అడ్డుకట్ట వేశాడు. చాలా నెలల తర్వాత కోహ్లి 50 పరుగులు పూర్తి చేసి ఔరా అనిపించాడు.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
ఈ మ్యాచ్‌లో ఆచి తూచి ఆడుతూ మొత్తంగా 50 పరుగులు పూర్తి చేశాడు. 50 బాల్స్‌లో 50 రన్స్ సాధించి అదరగొట్టేశాడు. అయితే ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్నాడు అని అనుకునేలోపే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఏది ఏమైనా ఇలా ఇప్పటి వరకు పేవల ఫామ్ కనబరిచిన రోహిత్, కోహ్లి ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి రావడంతో క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.