క్రికెట్ బెట్టింగ్ ఇది ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. చిన్న చిన్న గల్లీల్లో నుంచి పెద్ద పబ్ లూ...కంపెనీల్లో కూడా ఈ బెట్టింగ్ లు జరుగుతూ ఉంటాయి. ఇందులో చాలా సార్లు క్రికెటర్లు కూడా ఇన్వాల్స్ అయిన సందర్భాలున్నాయి. జడేజా, అజారుద్దీన్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ క్రోనే లాంటి వాళ్ళు క్రికెట్ నుంచి బహిష్కరణ కూడా అయ్యారు. ఈ బెట్టింగ్స్, స్కామ్ లు సాధారణంగా ఇండియాలో ఎక్కువగా జరుగుతుంటాయి కూడా. ఇందులో పెద్ద పెద్ద వ్యక్తుల హస్తం కూడా ఉంటుంది. ఏ ట్రోఫీ జరిగినా దానిలో ప్రతిష్టాత్మక మ్యాచ్ లు అన్నింటికీ బెట్టింగ్స్ వేస్తుంటారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు కూడా ఇదే జరుగుతోంది.
రంగంలోకి దావూడ్ డీ కంపెనీ..భారీ బెట్టింగ్..
ఈరోజు భారత్ , న్యూజిలాండ్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు హద్యాహ్నం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం అవనుంది. ఇందులో భారత్ ఫేవరెట్ గా ఉంది. కానీ న్యూజిలాండ్ కూడా చాలా బలమైన జట్టుగానే బరిలోకి దిగుతోంది. ఇక ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిచి ట్రోఫీని తీసుకురావాలని అందరూ అనుకుంటున్నారు. 12 ఏళ్ళ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రఓపీ టీమ్ ఇండియా కైవసం చేసుకోవాలని కలలు కంటున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ మీద బెట్టింగ్స్ కూడా అంతే జోరుగా సాగుతున్నాయి. దాదాపు రూ.5 వేల కోట్ల పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో దావూద్ కు సంబంధించిన డీ కంపెనీ కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. దుబాయ్ లో బుకీలు చాలా మంది హడావుడి చేస్తున్నారు. డీ కంపెనీ కూడా వీరితో చేతులు కలిపి భారీ ఎత్తున బెట్టింగ్స్ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పలువురి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ద్వారా అసలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Champions Trophy: ఈరోజే ఫైనల్స్..మళ్ళీ కప్పు తెస్తారా?