/rtv/media/media_files/2025/02/07/adEQ0RnwwHNSCYkO3maP.jpg)
indian cricket
రోహిత్ శర్మ తరువాత టీమిండియా జట్టకు కెప్టెన్ ఎవరనే దానిపై దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. భవిష్యత్‌లో వన్డేలకు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమిపాలైతే కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఉన్నప్పుడు పలు సిరీస్ లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు. దీంతో రోహిత్ తరువాత హార్దిక్ పాండ్యానే ఫుల్ టైమ్ కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయ్యారు.
కానీ.. 2023 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడటంతో కొన్ని రోజుల పాటు ఆటకు దూరం అయ్యాడు. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను టీ20లకు రెగ్యులర్ కెప్టెన్‌గా, అక్షర్‌పటేల్ వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇక గిల్ ను వన్డేలకు వైస్ కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. దీంతో పాండ్యా కెప్టెన్సీ రేసులో లేనట్లే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమిపాలైతే కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించేందుకు బీసీసీఐ రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి వన్డేలకు హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్ గా నియమించాలని హెడ్ కోచ్ గంభీర్ బీసీసీఐని కోరారు. కానీ కెప్టెన్ రోహిత్, అజిత్ అగార్కర్‌లు గిల్ వైపు మొగ్గు చూపారు.
మరోవైపు ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్‌పై కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించాలని బీసీసీఐ ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు పాకిస్థాన్, దుబాయ్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జట్టు తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆఖరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో మార్చి 2న ఆడనుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్ ), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆర్ష్‌దీప్ సింఘ్వాల్, ఆర్ష్‌విష్‌వాల్, షమీస్, ఆర్ష్‌విష్‌వాల్ పంత్, రవీంద్ర జడేజా.
Also Read : పద్దతి మార్చుకో రేవంత్.. ఎమ్మెల్యేల ముందే క్లాస్ పీకిన రాజగోపాల్ రెడ్డి!