Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. 

New Update
Sai Sudarshan

Sai Sudarshan

రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

తొలి ఇన్నింగ్స్ పూర్తి

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఉంది. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని

ఐపీఎల్ సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఇంటికి వెళ్ళిపోయినట్లే. హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే ప్లే ఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. దీనిపై కెప్టెన్ తలా ధోనీనే నిస్సహాయత వ్యక్తం చేశాడు. ఎవరూ ఆడకపోతే తానేం చేయాలి అంటూ బాధను వెళ్ళగక్కారు.

New Update
Dhoni IPL retirement

Dhoni IPL retirement

ఒకటి, రెండు ప్రాబ్లెమ్స్ అయితే సరిదిద్దుకోవచ్చును. చిన్న ప్లేయర్లు అయితే నేర్పించవచ్చును. కానీ ఆటగాళ్ళు పెద్ద వాళ్ళు అయి ఉండి...ఎక్కువ మంది ఆడకపోతే ఏం చేయగలము అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల కొట్టుకుంటున్నాడు. చెన్నై ఇప్పటికే తొమ్మిది మ్యాచ్‌ల్లో 19 మంది ఆటగాళ్లను ఆడించింది. రకరకాల కాంబినేషన్స్ కూడా ట్రై చేశాను. ఇంత చేసినా ఎవరూ ఆడలేదు.  ఉన్నవాళ్ళందరూ ఆడకపోతే ఎక్కువ మార్పులు చేయాల్సి వచ్చిందని ధోనీ చెప్పాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను బ్యాటర్లు ప్రతీసారి అటాక్ చేయలేకపోయారు. ఎంత చెప్పినా ఆడలేదు. మా ఓటమికి ప్రధాన కరణాల్లో అది కూడా ఒకటని ధోనీ చెప్పుకొచ్చాడు. 

ఇప్పటివరకు అతి చెత్త ప్రదర్శన..

ఐపీఎల్ 18 సీజన్ లో చెన్నై అతి పేలవమైన ప్రదర్శన చేసింది.  మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఆడింది. అందులో కేవలం రెండు మాత్రమే గెలిచింది. చాలా కీలకమైన మ్యాచ్ లలో చెత్త ప్రదర్శన ఇచ్చింది. కనీసం రన్ రేట్ ను కూడా మెయింటెయిన్ చేయలేకపోయింది. కెప్టెన్ మార్చారు, ప్లేయర్లను మర్చారు కానీ ఫలితం లేకపోయింది. ప్రతీ మ్యాచ్ లోనూ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిజానికి కెప్టెన్ ధోనీ కూడా పెద్దగా ఆడింది లేదు. కానీ చెన్నై జట్టుకు మళ్ళీ కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాక కాస్త బాగానే ఆడాడు. చివర్లో వచ్చినా మెరుపులు మెరిపించడంలో సఫలం అయ్యాడు. కానీ అతని కన్నా ముందు ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో మ్యాచ్ లు ఓడిపోయారు.  

today-latest-news-in-telugu | csk | IPL 2025 | mahendra-singh-dhoni 

Also Read: UP: పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో

Advertisment
Advertisment
Advertisment