/rtv/media/media_files/2025/03/29/tppBhO1VlGENFXdt2V4H.jpg)
sai-sudharshan
అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లుగా వచ్చిన సాయి సుదర్శన్(63), శుభ్‌మన్ గిల్(38) జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 48 బంతుల్లో 75 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దూకుడుగా ఆడుతుతున్న ఈ జోడీని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య విడదీశాడు. పాండ్య బౌలింగ్‌లో నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన జోస్ బట్లర్ (39) వరుస బౌండరీలతో హోరెత్తించాడు.
సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ
మరో ఎండ్ లో సాయి సుదర్శన్ కూడా ముంబై బౌలర్లకు చిక్కకుండా బౌండరీలు బాదుతూ పరుగులు రాబాట్టాడు. దీంతో 11 ఓవర్లకు గుజరాత్ వంద మార్క్ దాటింది. ఈ క్రమంలోనే సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం ముజీబుర్ రెహమాన్ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన జోస్ బట్లర్ (39) వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన షారుఖ్ ఖాన్ .. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కొద్దీగా స్కోరు నెమ్మదించింది.
SAI SUDHARSHAN ONE OF THE CONSISTENT BETTER WELL PLAYED.
— Harsh (@Harshsuthar119) March 29, 2025
- 74(41) IN FIRST MATCH.
- 63(41) IN SECOND MATCH.#GTvsMI #MIvsGT #mivsgt #gtvsmi #shubmangill #ShubmanGill #RohitSharma #RohitSharma𓃵 #HardikPandya #hardikpandya pic.twitter.com/y2mqVXtsPV
అనంతరం క్రీజులోకి వచ్చిన రూథర్ ఫోర్డ్ (18)తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు సాయి సుదర్శన్. తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు వేసిన 17 ఓవర్లో వీరిద్దరూ 19 పరుగులు బాదారు. ఈ టైమ్ లోనే గుజరాత్ వరుసగా వికెట్ల పతనం మొదలైంది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సాయిసుదర్శన్ వెనుదిరగగా.. ఆ తరువాత వచ్చిన రాహుల్ తెవాతియా రనౌట్ అయ్యాడు. ఆ కాసేపటికే భారీ షాట్ కు యత్నించి రూథర్ ఫోర్డ్ చాహర్ బౌలింగ్ లో శాంట్నర్ కు చిక్కాడు. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది.