/rtv/media/media_files/2025/02/13/Iwmg9mmP3FzzaNWdj3LT.jpg)
Gautam Gambhir names India top choice wicketkeeper for ICC Champions Trophy 2025
టీమిండియా మంచి జోష్ మీదుంది. వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీనిని 4-1 తేడాతో కైవసం చేసుకుంది. అలాగే రీసెంట్‌గా వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇలా వరుస మ్యాచ్‌లలో విజయం సాధిస్తూ దుమ్ము దులిపస్తోంది. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే ఫామ్ కొనసాగించాలనుకుంటోంది.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
అయితే ఈ ట్రోఫీకి తుది జట్టు ఎలా ఉండబోతుంది?.. ఎవరిని గ్రౌండ్‌లోకి దించుతారు? ఎవరిని బెంచ్‌కి పరిమితం చేస్తారు? అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు టీమిండియాలో ఇద్దరు కీపర్లు ఉన్నారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్.. ఈ ఇద్దరిలో ఛాయిస్ ఎవరికి వస్తుందా? అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
కీపర్‌గా మా ఫస్ట్ ఛాయిస్ అతడే
దీనిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపర్‌గా తమ ఫస్ట్ ఛాయిస్ కేఎల్ రాహులేనని అన్నాడు. అతడు ఇప్పుడు తమ నంబర్ వన్ వికెట్ కీపర్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైతే ఇది మాత్రమే చెప్పగలనని.. ఇక రిషభ్ పంత్ కు ఏ క్షణంలోనైనా అవకాశం రావచ్చని పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
Gambhir confirmed that KL Rahul is the first choice WK for India in #ChampionsTrophy
— Hemendra Meena (@hemendra56) February 13, 2025
So it ends the debate of WKs and almost end of pant in white ball cricket.
So, now India Wicketkeepers are
Test- Rishabh Pant
ODIs- KL Rahul
T20I- Sanju Samson pic.twitter.com/5JHJHvKRK6
ఇద్దరినీ ఆడించలేం
టీమ్‌లో ఇద్దరు నాణ్యమైన వికెట్ కీపర్‌లు ఉన్నపుడు మ్యాచ్‌లో ఇద్దరినీ ఆడించలేమన్నాడు. ఇదెలా ఉంటే రాహుల్ బ్యాటింగ్ స్థానంపై కూడా గంభీర్ మాట్లాడాడు. రాహుల్‌ని ఐదో స్థానంలోనే ఆడిస్తామని స్పష్టంగా చెప్పలేం అన్నారు. అతడు కాకపోయినా.. ఏ ప్లేయర్ అయినా ఐదో స్థానంలో ఆడొచ్చని తెలిపాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో..