/rtv/media/media_files/2025/04/08/abUkkfF0VeDmoEsBEfE8.jpg)
England Cricket Team New Captain Harry Brook
ఇంగ్లాండ్ వైట్‌బాల్ టీమ్స్ కొత్త కెప్టెన్ ఎవరు.. ఎవరు? అనే దానిపై సస్పెన్స్ వీడింది. యంగ్ అండ్ స్టార్ ప్లేయర్ న్యూ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వన్డే, టీ20లకు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబి) అనౌన్స్ చేసింది. కాగా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు పేవల ప్రదర్శన చేసింది. దీంతో తమ జట్టు దారుణ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు
ఇక అప్పటి నుంచి ఇంగ్లాండ్ నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకానొక సమయలో పలువరి పేర్లు కెప్టెన్‌గా వినిపించాయి. అందులో టెస్ట్ కెప్టెన్ స్టోక్స్ కూడా వైట్ బాల్ కెప్టెన్సీ బాధ్యతలను చేపడతాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు హ్యారీ బ్రూక్‌కు సారధిగా ఎంచుకుంది.
Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్
ఈ విషయాన్ని రీసెంట్‌గా అనౌన్స్ చేసింది. 26 ఏళ్ల యంగ్ ప్లేయర్ బ్రూక్ 2022 జనవరిలో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇంగ్లాండ్ వైట్ బాల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అంతేకాకుండా అతడు గత ఏడాది వన్డే, టీ20 ఫార్మాట్లలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే న్యూజిలాండ్‌లో 2018లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లోనూ ఇంగ్లాండ్ జట్టును ముందుకు నడిపించాడు అని ఈసీబీ చెప్పుకొచ్చింది.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
ఈసీబీ నిర్ణయంపై బ్రూక్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అన్నాడు. ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా సెలెక్ట్ కావడం గౌరవంగా భావిస్తున్నానన్నాడు. ఏదో ఒక రోజు జట్టుకు నాయకత్వం వహించాలని తాను కలలు కన్నానని.. ఇప్పుడు ఆ ఛాన్స్ తనకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.
Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
(england-cricket-team | harry-brook | latest-telugu-news | telugu-news | sports-news)