/rtv/media/media_files/2025/02/15/SXDQnVchIUJMqpQ74Esc.jpg)
yuzvendra chahal shares emotional post Photograph: (yuzvendra chahal shares emotional post)
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులకు సంబంధించి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని చాహల్, తరుపున న్యాయవాది వెల్లడించారు. మార్చి 20వ తేదీ గురువారం, వారిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. చాలా కాలంగా వీరి విడాకుల గురించి చర్చలు జరుగుతున్నాయి.
చాహల్, ధన శ్రీ విడాకుల కోసం బాంబే హైకోర్టులో ఫిబ్రవరి 5న పిటిషన్ దాఖలైంది. అయితే ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను హైకోర్టు మినహాయించింది. వివాహ చట్టంలోని సెక్షన్ 13B ప్రకారం విడాకులు తీసుకోవడానికి 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరం అన్నమాట. అయితే ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే చాహల్ రూ. 2.37 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం. ఈ విడాకుల తీర్పుకోసం చాహాల్ ఇంకా ఐపీఎల్ టీమ్ తో చేరలేదు.
పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున
34 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి అతను పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున ఆడనున్నాడు. ఈ టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభమవుతుంది. పంజాబ్ జట్టు మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. బాలీవుడ్ నటి ప్రీతి జింటా యాజమాన్యంలోని పంజాబ్ జట్టు, ఐపీఎల్ 2025 మెగా వేలంలో చాహల్‌ను కొనుగోలు చేసింది. చాహల్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీ రూ.18 కోట్ల భారీ బిడ్‌ను వేసింది.
Also read : నెక్ట్స్ శివజ్యోతి.. బెట్టింగ్ యాప్ కేసులో కదలుతున్న డొంక.. అరెస్టుకు రంగం సిద్ధం!
ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడంతో
కాగా ధనశ్రీ, యుజ్వేంద్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గత నెలలో చాహల్ న్యాయవాది నితిన్ కె గుప్తా మాట్లాడుతూ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లుగా ధృవీకరించారు.
Also Read : బండి సంజయ్కి బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు!