CSK:తండ్రి కాబోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్.. ఫ్యాన్స్‌కు పండగే!

న్యూజిలాండ్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య కిమ్ ఈ వారంలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని మూడవ, చివరి టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

New Update
Devon Conway

స్టార్ క్రికెటర్ తండ్రి కాబోతున్నాడు. క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో ఎంతోమందిని ఉర్రూతలూగించిన ఆ క్రికెటర్ ఇప్పుడు.. ఓ బిడ్డకు తండ్రి కాబోతుండటంతో ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. అయితే ఈ సమయంలో క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి భార్య వద్దనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే త్వరలో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు దూరమవ్వనున్నాడు. అయితే ఆ బ్యాటర్ మరెవరో కాదు డెవాన్ కాన్వే. 

Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

డెవాన్ కాన్వే తండ్రి కాబోతున్నాడు

డెవాన్ కాన్వే.. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్. అతడు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌ కూడా. అయితే డెవాన్ కాన్వే ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య కిమ్ ఈ వారంలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని మూడవ, చివరి టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఎందుకంటే తన భార్య కిమ్ బిడ్డకు జన్మనివ్వబోతున్న సమయంలో అతడు ఆమె పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. 

Also Read: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

అందువల్ల ఈ విషయాన్ని కాన్వే ముందుగానే బోర్డుకు తెలియజేశాడు. దీంతో చివరి టెస్టుకు కాన్వే స్థానంలో మార్క్ చాప్‌మన్‌‌ను న్యూజిలాండ్ బోర్డు ఎంపిక చేసింది. కాగా హామిల్టన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి  మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

Also Read: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

ఇదిలా ఉంటే దీనిపై న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ స్పందించారు. ఆటగాళ్లకైనా.. సిబ్బందికైనా కుటుంబమే మొదటి ప్రాధాన్యత అన్నారు. కాన్వే భార్య కిమ్ బిడ్డకు జన్మనివ్వనుంది. ఇది 
వారి ఫ్యామిలీలో ఎంతో సంతోషం నింపే విషయం అని అన్నారు. 

Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!

ఇదిలా ఉంటే కొనసాగుతున్న సిరీస్‌లో కాన్వే ఎలాంటి ఫామ్‌లో లేడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. కానీ భారత్‌తో జరిగిన సిరీస్‌లో మాత్రం బాగా రాణించాడు. స్వదేశంలో టీమిండియాను 3-0 తేడాతో కివీస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు వారి సొంత గడ్డపై ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఇంగ్లాండ్ 2-0 తో చేజిక్కించుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG Breaking: రిటైర్మెంట్ వార్తలపై ధోనీ బిగ్ అనౌన్స్మెంట్!

ధోని తన రిటైర్మెంట్ వార్తలపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావించాడు. 44 ఏళ్ల వయసులో కూడా తాను క్రికెట్ ఆడుతున్నానని..  తదుపరి సీజన్ ఆడాలా వద్దా అనేది డిసైడ్ కావడానికి ఇంకా పది నెలల సమయం ఉందన్నాడు. తన శరీరం అందించే సహకారాన్ని బట్టి నిర్ణయం ఉంటుందన్నాడు.

New Update
Dhoni IPL retirement

Dhoni IPL retirement

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ వార్తలపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావించాడు. ఏప్రిల్ 5, శనివారం రోజున చిదంబరం స్టేడియంలోని స్టాండ్స్‌లో ధోని తల్లిదండ్రులు మ్యాచ్ చూస్తూ కనిపించినప్పుడు ధోనీ తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వ్యాపించాయి. అయితే రాజ్ షమానీతో కొత్త పాడ్‌కాస్ట్‌లో, ధోని రిటైర్మెంట్ పుకార్లను ప్రస్తావిస్తూ ఈ సీజన్ చివరిలో తన కెరీర్‌కు ముగింపు పలకడం లేదని అభిమానులకు భరోసా ఇచ్చాడు.

శరీరం అందించే సహకారాన్ని బట్టి నిర్ణయం

44 ఏళ్ల వయసులో కూడా తాను క్రికెట్ ఆడుతున్నానని..  తదుపరి సీజన్ ఆడాలా వద్దా అనేది డిసైడ్ కావడానికి ఇంకా పది నెలల సమయం ఉందన్నాడు. అందుకు తన శరీరం అందించే సహకారాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని ధోనీ పాడ్‌కాస్ట్‌లో  చెప్పుకొచ్చాడు. ఐపీఎల్  2025 కి ముందు, ధోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలించినంత కాలం క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. 

2008 నుండి చెన్నై తరుపున

ధోని 2008 నుండి చెన్నై సూపర్ కింగ్స్‌ తరుపున ఆడుతున్నాడు.  అతని నాయకత్వంలో ఆ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. 2022లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీని అప్పగించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ జట్టు బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది. 2023 ప్రారంభంలో ధోని తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు.  

Also Read :  Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు"ప్రభుత్వ" కానుక..ఆనాటి నుంచే…..

 

Advertisment
Advertisment
Advertisment