Virat Kohli: ఏంటి బ్రో అంతమాట అనేసావ్.. T20ల్లో టెస్ట్ ఇన్నింగ్ ఆడావా: కోహ్లీపై ట్రోల్స్

చెన్నైతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై ట్రోల్స్ వస్తున్నాయి. ఓపెనర్‌గా వచ్చిన అతడు 30 బంతుల్లో కేవలం 31 పరుగులు సాధించడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. టీ20ల్లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

New Update
csk vs rcb Virat Kohli scored 31 runs off 30 balls match against Chennai

csk vs rcb Virat Kohli scored 31 runs off 30 balls match against Chennai

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ 8వ మ్యాచ్ జరుగుతోంది. CSK VS RCB మధ్య ఉత్కంఠ మ్యాచ్‌ను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. మొదట టాస్ ఓడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసింది. ఇందులో భాగంగానే ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చారు. సాల్ట్ మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు రాబడుతూ హోరెత్తించాడు. అతడు ఉన్నంత వరకు స్కోర్ పరుగులు పెట్టింది. మరోవైపు విరాట్ కోహ్లీ స్లోగా తన గేమ్ ప్రారంభించాడు.

సాల్ట్ ఔటయ్యాక కూడా ఎక్కడా స్పీడ్ పెంచలేదు. ఒక్కో పరుగు రాబట్టాడు. ఇప్పుడు అదే అతడిపై ట్రోల్స్ చేసేలా చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్సింగ్స్‌లో నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ 30 బంతుల్లో కేవలం 31 పరుగులు మాత్రమే సాధించి ఔటయ్యాడు. దీంతో చాలా మంది అతడి ఆటతీరుపై ట్రోల్స్ చేస్తున్నారు.

విరాట్ T20ల్లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడని సోషల్ మీడియాలో ఎద్దెవా చేస్తున్నారు. అంతేకాకుండా చాలా షాట్లు కనెక్ట్ చేయలేకపోయాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అభిమానులు విరాట్‌కు మద్దతు ఇస్తున్నారు. పిచ్ కఠినంగా ఉందని.. అక్కడ వేగంగా ఆడటం కష్టమని ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు.  

(ipl-2025 | csk-vs-rcb | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment