/rtv/media/media_files/2025/03/28/byzddmLBTXX0kE9iVvKB.jpg)
RCB
చెన్నై సూపర్ కింగ్స్ వేగంగా వికెట్లు కోల్పోతోంది. 75 పరుగులకు 6 వికెట్లు పొగొట్టుకుని కష్టాల్లో పడింది. తాజాగా రచిన్ రవీంద్ర, దూబే వికెట్లు జడేజా,ధోనీ క్రీజులో ఉన్నారు. రచిన్ రవీంద్ర ఒక్కడే 41 పరుగుల హైయ్యెస్ట్ స్కోర్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లు అందరూ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరిలో భువనేశ్వర్ కుమార్ రెండు, దయాల్ రెండు, హెడ్స్ ఒక వికెట్ తీశారు.
ఐపీఎల్ లో చెన్న సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాంలెజర్స్ మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 7 వికెట్లు నష్టానికి 196 పరుగులు చేసింది. దీని తర్వాత సీఎస్కే 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో ఎనిమిది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ లు తమ వికెట్లు కోల్పోయారు.