/rtv/media/media_files/2025/02/14/tZYTuvCCCQP0Lh6Uu8zs.jpg)
Champions Trophy 2025 Prize Money
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025)కి రంగం సిద్ధమైంది. పాకిస్థాన్(Pakistan) ఆతిథ్యాన ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానుంది. దీంతో పలు టీమ్‌లు ఇప్పటికే తమ స్క్వాడ్ లను ప్రకటించాయి. దాదాపు ఎనిమిది టీమ్‌లు ఉన్నాయి. అయితే భారత్(India) ఆడనున్న మ్యాచ్‌లు మాత్రం దుబాయ్(Dubai) వేదికగా జరగనున్నాయి.
Also Read: మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?
అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ2025కి సంబంధించి ఇప్పుడొక అదిరిపోయే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ టోర్నీ ప్రైజ్ మనీని(Champions Trophy 2025 Prize Money) తాజాగా ఐసీసీ ప్రకటించింది. అది తెలిసి అంతా ఆశ్యర్యపోతున్నారు. ఇంత భారీ మొత్తంలో విజేత టీమ్‌కు ప్రైజ్ మనీ ఇవ్వనున్నారా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఐసీసీ ప్రకటించిన ప్రైజ్ మనీ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడి
గతంతో పోలిస్తే చాలా ఎక్కువ
ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. ఈ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచింది. అప్పుడు గెలిచిన జట్టుకు దాదాపు రూ.14.18 కోట్లను ప్రైజ్ మనీగా ఐసీసీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం గతంతో పోలిస్తే దాదాపు 53 శాతం ప్రైజ్ మనీని ఐసీసీ పెంచింది. రూ.60 కోట్ల ప్రైజ్ మనీని జట్టులకు పంచనుంది. లాస్ట్ ప్లేస్‌లో నిలిచిన జట్టుకూ ప్రైజ్ మనీ ఇవ్వనుంది. దానికి రూ.1.22 కోట్లు దక్కనుంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు దాదాపు రూ.29 లక్షలు ఎక్స్‌ట్రాగా పంచనుంది.
Also Read: Acid Attack News: లవర్స్ డే రోజునే దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి!
ICC has announced a prize pool of $6.9 million for the Champions Trophy 2025 🏆#CT25 #ChampionsTrophy pic.twitter.com/B2Xnys86QD
— Circle of Cricket (@circleofcricket) February 14, 2025
ప్రైజ్‌మనీ వివరాలు
విజేత ప్రైజ్‌మనీ - రూ.20.8 కోట్లు
రన్నరప్ ప్రైజ్‌మనీ - రూ.10.4 కోట్లు
సెమీ ఫైనలిస్టులు - రూ.5.2 కోట్లు (ఒక్కొక్క జట్టుకు)
ఐదో స్థానం, ఆరో స్థానం - రూ.3 కోట్లు
ఏడు, ఎనిమిదో స్థానాలు - రూ.1.2 కోట్లు
ప్రతి మ్యాచ్‌కు ప్రైజ్‌మనీ - రూ.29 లక్షలు