IND vs AUS: ఆసీస్‌పై అదిరే విక్టరీ.. ఫైనల్‌కు భారత్!

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కి వెళ్లింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల టార్గెట్‌ను భారత్ 48.1 ఓవర్లలో పూర్తి చేసి ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. 

New Update
Champions Trophy Live Updates

Champions Trophy Live Updates

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల టార్గెట్‌ను భారత్ 48.1 ఓవర్లలో పూర్తి చేసి ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. 

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ ఓటమికి ఆసీస్‌పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌ను గెలిపించడంలో విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర వహించాడు. మొత్తం 98 బంతుల్లో 84 స్కోర్ చేశాడు. రోహిత్ శర్మ 28, శుభమన్ గిల్ 8, అక్షర్ పటేల్ 27, శ్రేయస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42, హార్డిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు ఆడమ్ జంపా 1, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కూపర్ కనోలీ ఒక్కో వికెట్ తీశారు. 

సెమీ ఫైనల్స్‌లో ఆసీస్‌ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కి చేరింది. ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో మార్చి 9న జరగనుంది. అయితే బుధవారం న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య జరగనుంది. ఈ సెమీ ఫైనల్ 2లో విజేతగా ఎవరైతే గెలుస్తారో వారితో భారత్‌ ఫైనల్‌లో తలపడనుంది. 

 

Advertisment
Advertisment
Advertisment