/rtv/media/media_files/2025/03/23/HhgxEeRR0b6zS11bQFU1.jpg)
IPL Match
ఐపీఎల్ సీజన్ మొదలైపోయింది. శనివారం రాత్రి ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ ల మధ్య మొదటి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. హైదరాదాల్‌లోని ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోది. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరంలో నలుగురు, ఎల్బీ నగర్‌లో ముగ్గురు, మల్కాజ్‌గిరిలో ముగ్గురు, భువనగరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: పార్లమెంట్‌లో అరకు కాఫీ.. రేపే రెండు స్టాల్స్ ప్రారంభం
ఇదిలాఉండగా ఆదివారం జరగనున్న సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కోసం పోలీసులు అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 450 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్.. భారత్ కోటి ఖాతాలు తొలగింపు!
అంతేకాదు స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, సెంట్స్, స్ప్రేలు, బ్యాగులు, బయటి ఆహార పదార్థాలకు పర్మిషన్ లేదని రాచకొండ సీపీ సుదీర్ బాబు చెప్పారు.
Also Read: బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే!