/rtv/media/media_files/2026/03/04/rohit-kohli-2026-03-04-17-01-02.jpg)
భారత క్రికెట్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మైదానంలో మరిన్ని వన్డే మ్యాచ్‌ల్లో చూసే అవకాశం అభిమానులకు కలగనుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆటగాళ్లకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో తగినంత ప్రాక్టీస్ కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది వన్డే మ్యాచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ , ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత జట్టు తన దృష్టిని వన్డేలపై మళ్లించనుంది. జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌తో ఈ ప్రయాణం ప్రారంభమై, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో కొనసాగనుంది.
న్యూజిలాండ్ పర్యటనలో కీలక మార్పులు
అక్టోబర్‌లో జరగనున్న న్యూజిలాండ్ పర్యటనలో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ పర్యటనలో ఐదు టీ20లు, రెండు వన్డేలు, రెండు టెస్టులు ఉండాల్సి ఉంది. అయితే, వన్డేల సంఖ్యను పెంచాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. దీని ప్రకారం, టీ20ల సంఖ్యను మూడుకు తగ్గించి, వన్డేల సంఖ్యను నాలుగుకు పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే, కోహ్లీ మరియు రోహిత్ ఈ ఏడాది అదనంగా రెండు వన్డే మ్యాచ్‌ల్లో కనిపిస్తారు. ఆరు ఏళ్ల తర్వాత భారత్ పూర్తిస్థాయిలో న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే టీ20లతో పాటుగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోకో ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించారు. మరోవైపు, ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో జూన్ 6 నుండి 10 వరకు చండీగఢ్‌లో ఒక టెస్ట్ మ్యాచ్, ఆ తర్వాత జూన్ 14 నుండి ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరగనున్నాయి. 2024 తర్వాత భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో రోకో అభిమానులు మరింతగా ఖుషి అవుతున్నారు.
Follow Us