/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/bcci.jpg)
బీసీసీఐ.. సెక్రెటరీ, కోశాధికారి పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. జనవరి 12న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్‌తోపాటు దేవ్‌జిత్ సైకియా కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Also Read : పుష్ప-2 సెట్ లో కొరియోగ్రాఫర్ శ్రష్టీ బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్!
రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారం..
అయితే ఎన్నికలకు సంబంధించిన సమావేశం ముంబైలో నిర్వహించనుండగా.. అదే రోజు కార్యదర్శి, కోశాధికారి పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల అధికారిగా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతిని నియమించిన విషయం తెలిసిందే. కాగా అపెక్స్ కౌన్సిల్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.
Also Read : టార్గెట్ అల్లు అర్జున్.. విజయనగరం టూర్ లో పవన్ సంచలన వ్యాఖ్యలు!
A great start at the @ICC HQ connecting with my colleagues on the Board and the ICC team. Let the work begin! pic.twitter.com/QgbDoPDdBK
— Jay Shah (@JayShah) December 5, 2024
Also Read : హైదరాబాద్ లో 100 అడుగుల NTR విగ్రహం.. స్థలం కేటాయించిన సీఎం రేవంత్!
ఇటీవలే ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. మహారాష్ట్ర మంత్రిగా ఆశిష్ షెలార్ బాధ్యతలు స్వీకరించడంతో బోర్డు కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. ఇక బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఏదైనా పోస్ట్ ఖాళీ అయితే వారి స్థానంలో కొత్త వాళ్లను 45 రోజుల్లో ఎంచుకోవాలి. ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల అధికారిని ఎంపిక చేయాలి. కానీ ఈసారి కార్యదర్శితోపాటు కోశాధికారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : మోడ్రన్ శారీలో అదరగొట్టిన తెలుగమ్మాయి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే