/rtv/media/media_files/2025/03/24/hVnmjWztgm5jx2pu88Xr.jpg)
బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. 2024-25 సీజన్ కోసం మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం16 మంది ఆటగాళ్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే ఈ కాంట్రాక్ట్ లను మూడు గ్రేడ్లుగా విభజించింది. గ్రేడ్ Aలో ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. ఇక గ్రేడ్ B లో నలుగురికి, గ్రేడ్ Cలో తొమ్మిదిమంది ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ కాంట్రాక్ట్ 2024 అక్టోబర్ 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. A గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ.50 లక్షలు,గ్రేడ్ B లో ఉన్నవారికి రూ.30 లక్షలు, గ్రేడ్ Cలో ఉన్నవారికి రూ. 10 లక్షల వార్షికంగా అందజేయనున్నారు. మ్యాచ్ ఫీజులు మాత్రం అదనంగా ఉంటాయి.
Also Read : సౌత్ డైరెక్షన్.. నార్త్ యాక్షన్ - ‘జాట్’ ట్రైలర్ గూస్‌బంప్సే
🚨 News 🚨
— BCCI Women (@BCCIWomen) March 24, 2025
BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Women)#TeamIndia pic.twitter.com/fwDpLlm1mT
Also Read : గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్
బోర్డు కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేసింది. కొంతమంది ఆటగాళ్ళు ఎలిమినేట్ కాగా మరికొందరికి అదృష్టం కలిసి వచ్చింది. యువ ఫాస్ట్ బౌలర్ టైటస్ సాధు, ఆల్ రౌండర్ అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, వికెట్ కీపర్-బ్యాటర్ ఉమా ఛెత్రి, శ్రేయంకా పాటిల్ గ్రేడ్ Cలో చోటు దక్కించుకున్నారు. గ్రూప్ Cనుండి ఎలిమినేట్ అయిన వారిలో మేఘనా సింగ్, దేవిక వైద్య, ఎస్ మేఘనా, అంజలి సర్వాణి, హర్లీన్ డియోల్ ఉన్నారు.
గ్రేడ్ Aలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఇందులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సెలెక్టర్ల దృష్టికి దూరంగా ఉన్న ఎడమచేతి వాటం స్పిన్నర్ రాజేశ్వరి గయక్వాడ్‌ను గ్రేడ్ B జాబితా నుంచి తొలగించారు.
Also Read : కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!
బీసీసీఐ మహిళల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా
గ్రేడ్ ఎ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ.
గ్రేడ్ బి: రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ.
గ్రేడ్ సి: యాస్టికా భాటియా, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, టైటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ రాణా, పూజ వస్త్రాకర్.
Also read : ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో!
Central Contract | women cricketers | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu