/rtv/media/media_files/2025/03/06/XtfBkfcDDTNYcEa8a4Ob.jpg)
Mushfiqur Rahim Photograph: (Mushfiqur Rahim)
బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫీకర్ రహీం వన్డేలకు ఇక వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీనే ముష్ఫీకర్ చివరి ఐసీసీ వన్డే టోర్నీ. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ఇందులో ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా ఓడిపోయింది.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
A legendary ODI career 👏
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2025
Mushfiqur Rahim retires with the most matches, most dismissals and second-most runs for Bangladesh in 50-over cricket 🇧🇩 pic.twitter.com/H2e17Glxm6
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో..
రెండు మ్యాచ్‌ల్లో కూడా విఫలం కావడంతో రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు సమాచారం. 2006లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్ తరఫున 274 మ్యాచ్‌లు ఆడి.. 7,795 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 9 శతకాలు, 49 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే వికెట్ కీపింగ్‌లో ముష్ఫీకర్ మొత్తం 243 క్యాచ్‌లు అందుకున్నాడు.
JUST IN: Mushfiqur Rahim, Bangladesh's most-capped ODI cricketer, has announced his retirement after 274 matches for his country 🇧🇩 pic.twitter.com/KSAarJjULl
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2025
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
ఇదిలా ఉండగా ఇటీవల ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!