/rtv/media/media_files/2025/02/28/vdswgWEK4O3LKKIIYekL.jpg)
Afghan Vs Ausis Match Cancelled
గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చితక్కొట్టి టాప్ క్రికెట్ టీమ్ ల పక్కన చేరిన ఆఫ్ఘనిస్థాన్ కష్టం ఈరోజు నీళ్ళపాలైంది. ఆడే సత్తా ఉన్నా..నిరూపించుకునే అవకాశం లేక ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
బ్యాడ్ లక్ ఆప్ఘనిస్తాన్..
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సెదిఖుల్లా అటల్ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) రాణించారు. తరువాత ఆసీస్ బ్యాటర్లు కూడా క్రీజులోకి వచ్చారు. 274 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించారు. 12.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసి..ట్రావిస్ హెడ్ 59, స్టీవ్ స్మిత్ 19 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. సరిగ్గా అప్పుడే చినుకులు పడడం మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. తరువాత వర్షం చాలా పెద్దై కాసేపటికే తగ్గింది. అయితే వాన తగ్గినా ఔట్ పోస్ట్ లో భారీగా నీళ్ళు లిచిపోయాయి. దీంతో నిర్ణీత సమయంలో ఔట్ ఫీల్డ్ ఆటకు సిద్దధం కాలేదు. ఈ కారణంగా అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఆసీస్, అఫ్గానిస్థాన్‌కు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో గ్రూప్ బి నుంచి నాలుగు పాయింట్లతో అస్ట్రేలియా సెమీస్ కు వెళ్ళగా.. మూడు పాయింట్లతో అఫ్గానిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి