Anil Chaudhary : అంపైర్‌గా రిటైర్మెంట్..కామెంటేటర్గా కొత్త అవతారం!

భారత్ కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి అంపైర్‌గా రిటైర్మెంట్ ప్రకటించారు.  2013లో అంపైరింగ్ కెరీర్‌ను ప్రారంభించిన అనిల్ చౌదరి 12 టెస్టులు, 49 వన్డేలు, 131 ఐపీఎల్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు.

New Update
anil chaudhary umpire

భారత్ కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి అంపైర్‌గా రిటైర్మెంట్ ప్రకటించారు.  2013లో అంపైరింగ్ కెరీర్‌ను ప్రారంభించిన అనిల్ చౌదరి 12 టెస్టులు, 49 వన్డేలు, 131 ఐపీఎల్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. మొత్తం మీద 91 ఫస్ట్-క్లాస్ , 114 లిస్ట్ ఎ, 28 టీ20లలో అంపైరింగ్ చేశారు. అంపైర్‌గా చివరిసారిగా 2023 సెప్టెంబర్ 27న రాజ్‌కోట్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ కు ఆయన అంపైరింగ్ చేశారు.  

యాదృచ్చికం ఏంటంటే.. 2013లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ తోనే ఆయన తొలిసారి అంపైరింగ్ చేశారు. అనిల్ చౌదరి అంపైరింగ్ నుంచి పూర్తిగా రిటైర్ కాలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన ఈయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా జూనియర్  అంపైర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈయన కామెంటేటర్ గా కొత్త అవతారం ఎత్తనున్నారు. అంపైర్ పనిచేసి కామెంటేటర్ గా మారిన తొలి వ్యక్తి ఈయనే కావడం విశేషం.  

ఐపీఎల్‌లో 7 మంది కొత్త భారత అంపైర్లు 

బీసీసీఐ ఐపీఎల్ 2025 కోసం ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లను ప్రకటించింది. స్వరూపానంద్ కన్నూర్, అభిజీత్ భట్టాచార్య, పరాశర్ జోషి, అనిష్ సహస్త్రబుద్ధే, కేయూర్ కేల్కర్, కౌశిక్ గాంధీ, అభిజీత్ బెంగేరి  లను ప్రకటించింది. వీరికి  రవి, నందన్ మార్గదర్శకత్వం వహిస్తారు. అంతేకాకుండా ఐపీఎల్ కోసం మైఖేల్ గోఫ్, క్రిస్ గఫానీ, అడ్రియన్ హోల్డ్‌స్టాక్ లను అంతర్జాతీయ అంపైర్లుగా ప్రకటించింది. 

Also Read :  Pakistan : అవన్నీ తూచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల లాభపడ్డాం: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

 

 

Advertisment
Advertisment
Advertisment