/rtv/media/media_files/2025/03/03/tPWR0BJ5vR7tkN2UWjJu.jpg)
Ajinkya Rahane named captain of KKR Photograph
ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల అంటే మార్చి 22 నుంచే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను, కెప్టెన్‌లను ప్రకటించాయి.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
కానీ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌ను ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో ఆ జట్టు కెప్టెన్ ఎవరా? అని అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రింకు సింగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు జోరుగా సాగాయి. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ పేరు వినిపించింది. దీంతో కెకెఆర్ కెప్టెన్ ఎవరంటూ మరింత ఆసక్తి నెలకొంది.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
🚨 𝐍𝐄𝐖 𝐄𝐑𝐀 𝐅𝐎𝐑 𝐊𝐊𝐑! 🚨
— Sportskeeda (@Sportskeeda) March 3, 2025
Kolkata Knight Riders, the IPL 2024 champions, have announced Ajinkya Rahane as their captain for the upcoming season! 💜✨
Can he lead them to glory once again? 🏆🤔
📸 Image Credits: KKR, IPL, BCCI#Cricket #KKR #Rahane #IPL2025 pic.twitter.com/N4K0FxgY0n
కెప్టెన్‌గా అతడే
ఈ క్రమంలో అందరి ఎదురుచూపులకు తెరపడింది. తాజాగా కెకెఆర్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. మెగా వేలంలో రెండవ రోజు చివరి నిమిషంలో తీసుకున్న అజింక్య రహానేను ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా వెంకటేష్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేకేఆర్ యాజమాన్యం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.
🚨 𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗔𝗻𝗻𝗼𝘂𝗻𝗰𝗲𝗺𝗲𝗻𝘁 - Ajinkya Rahane named captain of KKR. Venkatesh Iyer named Vice-Captain of KKR for TATA IPL 2025. pic.twitter.com/F6RAccqkmW
— KolkataKnightRiders (@KKRiders) March 3, 2025
ఇది మాత్రమే కాకుండా కేకేఆర్ జట్టు ఈసారి సీజన్‌కు కొత్త జెర్సీతో సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కొత్త జెర్సీని నేడు రివీల్ చేసింది. ఆ జెర్సీపై మూడు స్టార్లకు స్థానం కల్పించింది. దీనర్థం.. ఇప్పటి వరకు కేకేఆర్ ఐపీఎల్‌లో మూడు టైటిల్స్‌ను కైవసం చేసుకోవడంతోనే జెర్సీపై మూడు స్టార్లకు స్థానం కల్పించారు.
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!
𝗔𝗮𝗺𝗱𝗲𝗿 𝗡𝗮𝘁𝘂𝗻 𝗢𝗱𝗵𝗶𝗻𝗮𝘆𝗼𝗸! 💜
— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) March 3, 2025
Ajinkya Rahane Becomes the Captain of Kolkata Knight Riders.#AmiKKR #NatunOdhinayok pic.twitter.com/lMZ4dBxcrP