/rtv/media/media_files/2025/03/22/kq67fZwpZkJpIagTrbKD.jpg)
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన రహానే వరుసగా ఫోర్లు, సిక్సర్లతో దూకుడుగా ఆడుతూ ఆర్సీబీ బౌలర్లుకు చుక్కలు చూపించాడు. 56 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు రహానే. తన ఇన్నింగ్స్ లో మొత్తం ఆరు ఫోర్లు, నాలుగు సిక్సలున్నాయి. రెండో వికెట్ కు దాదాపుగా సునీల్ నైరన్ తో కలిసి 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కోల్‌కతా కొనుగోలు చేసింది. అయితే తొలి రౌండ్‌లో అమ్ముడుపోని రహానేను ఆఖరి రౌండ్‌లో కేకేఆర్ సొంతం చేసుకుంది. చివరకు అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ అతని ఆటపై ఎవరికి అంతగా అంచనాలు లేవు .. వన్స్ గ్రౌండ్ లోకి దిగాక వరుస ఫోర్లు, సిక్సర్లతో రహానే వీరవిహారం చేశాడు. అసలు ఆడుతుంది రహానేనా అని ప్రేక్షకులు కూడా స్టన్ అయ్యారు. టీమిండియా జట్టులో చోటు కోల్పోవడం, ఐపీఎల్-2025లో మెగా వేలంలో తొలి రౌండ్‌లో అమ్ముడుపోకపోవడం రహానేలో కసిని పెంచాయి. 36 ఏళ్ల రహానే తనలో ఇంకా కసి తగ్గలేదని ఆర్సీబీ మ్యాచ్ లో తన ఇన్నింగ్స్ తో అందరి నోళ్లు మూయించాడని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
"🔥 Unsold in the first IPL 2025 auction… Picked by KKR for base price… Becomes captain…
— Rajesh Sundaran (@editorrajesh) March 22, 2025
And now, Ajinkya Rahane smashes a blazing 50 off just 25 balls in the opening match! 💥🔥
The real unsung hero rises! 🙌🏏"#AjinkyaRahane #KKR #IPL2025 pic.twitter.com/MBuMvEvJJa
also read : కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత... దినేష్ కార్తీక్ తరువాత మూడో ఆటగాడిగా రికార్డు!