అండర్ -19 ఆసియా కప్ టోర్నీ షార్జా వేదికగా జరుగుతోంది. ఈ టోర్నీలో యువ భారత్ అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడి ఓటమిపాలైన యువ భారత్.. రెండో మ్యాచ్‌లో 211 పరుగుల భారీ తేడాతో జపాన్‌ను మట్టికరిపించింది. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? భారత్ ఘన విజయం అదే సమయంలో మూడో మ్యాచ్‌లో భాగంగా యువ భారత్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో షార్జా క్రికెట్ స్టేడియంలో తలపడింది. ఈ మ్యాచ్‌లో యూఏఈను భారత్ చిత్తుగా ఓడించింది. 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! ముందుగా టాస్ గెలిచి యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్ల దాటికి యూఏఈ కుప్పకూలింది. కేవలం 137 పరుగులే చేసింది. అందులో రయాన్ ఖాన్ అనే ఆటగాడు ఒక్కడే 35 పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో 44 ఓవర్లలోనే యూఏఈ ఆల్‌ఔట్ అయింది. ఇక భారత్ బౌలర్లలో యుధాజిత్ గుహ చెలరేగాడు. దాదాపు 3 వికెట్లు తీశాడు. అలాగే చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు తీశారు. ఇంకా ఆయుశ్ మాత్రే, కేపీ కార్తికేయ ఒక్కో వికెట్ పడగొట్టారు. Also Read : కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది? ఇక 138 పరుగుల లక్ష్య ఛేదనతో భారత్ దిగింది. ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా దిగి సంచలనం సృష్టించారు. మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపేశారు. ఆయుశ్ 51 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్! అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ 46 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడు మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగాడు. ఇలా ఇద్దరు ఓపెనర్లు చెలరేగడంతో యువ భారత్ 16.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి విజయం సాధించింది. ఇక డిసెంబరు 6న సెమీస్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఫైనల్ మ్యాచ్ డిసెంబరు 8న జరుగనుంది.