Elon Musk : స్పేస్ ఎక్స్‌ మీద ఇంజనీర్ల దావా.. పిల్లలను కనాలని మస్క్ తమను వేధించాడంటున్న ఉద్యోగినులు

రాకెట్లను తయారుచేసే స్పేస్ ఎక్స్, దాని ఓనర్ ఎలాన్ మస్క్ మీద ఎనిమిది మంది ఇంజనీర్లు దావా వేశారు. సెక్సిజం ఆరోపణలు చేశామంటూ తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తీసేశారని వారు ఆరోపించారు.

New Update
Elon Musk : స్పేస్ ఎక్స్‌ మీద ఇంజనీర్ల దావా.. పిల్లలను కనాలని మస్క్ తమను వేధించాడంటున్న ఉద్యోగినులు

Space X : న్యాయం కోసం వెళితే తమకు అన్యాయం ఎదురైంది అంటుననారు ఎనిమిది మంది ఉద్యోగులు. ఎలాన్ మస్క్ (Elon Musk) సెక్సిజం (Sexism), మహిళా ఉద్యోగినుల (Women Employees) పట్ల రేసిజాన్ని ప్రశ్నించినందుకు తమను ఉద్యోగంలో నుంచి తీసేశారని స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ మీద దావా వేశారు ఎనిమిది మంది ఉద్యోగులు. లాస్ ఏంజిలెస్ కోర్టు వీరు ఈ దావాను సమర్పించారు. ఎనిమిది మందిలో నలుగురు మగవారు, నలుగురు ఆడవారు ఉన్నారు. తమను 2022లో ఉద్యోగం నుంచి బయటకు పంపించారని...అది కూడా మస్క్ గురించి సెక్స్ ఆరోపణలు చేస్తూ లెటర్ సర్క్యులేట్ అయ్యాకనే అని వారు చెబుతున్నారు. అంతేకాదు మహిళా ఉద్యోగినుల పట్ల ఎలాన్ మస్క్ చర్యలు విపరీతంగా ఉండేవని ...తమను సెక్స్‌లో పాల్గొనాలని ఆయన వేధించేవారని...అలా కాని పక్షంలో మహిళపట్ల వివక్ష చూపుతూ ప్రవర్తించేవారని మహిళా ఉద్యోగినులు ఆరోపించారు. అయితే ఈ దావాపై స్పేస్ ఎక్స్ ఇప్పటివరకు స్పందిచలేదు. దీనికి కౌంటర్‌ పార్ట్‌గా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

మరోవైపు ఎలాన్ మస్క్ గురించి మహిళా ఉద్యోగినులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. వీటి మీద పలు అంతర్జాతీయ కథనాలు బయటకు వచ్చాయి. స్పేస్ ఎక్స్ ఇంటర్న్ అయిన ఓ మహిళను పిల్లలను కనాలంటూ మస్క్ బలవంతం చేశారని తెలుస్తోంది. పదేపదే ఆమెను వేధించారని ఉద్యోగిని చెప్పింది. మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. దీని కోసం రాత్రిపూట తన ఇంటికి రావాలని మస్క్ కోరినట్లు ఆమె తెలిపింది. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్‌ చేశారంటూ స్పేస్‌ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.

Also Read:Odisha: ఇది కదా ఆదర్శం అంటే..మాఝీ ప్రమాణస్వీకారానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SAF vs RSF: పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా?

పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు నార్త్‌ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఈ విషయాన్ని స్టేట్‌ హెల్త్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ ఇబ్రహీం ఖతీర్‌ వెల్లడించారు.

New Update
Sudan

Sudan Photograph: (Sudan)

ఆఫ్రికా దేశమైన సూడాన్‌‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు దాడికి పాల్పడ్డాయి. నార్త్ డార్ఫర్‌లో ఉన్న రెండు శిభిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్టేట్‌ హెల్త్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ ఇబ్రహీం ఖతీర్‌ వెల్లడించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

114 మందికి పైగా..

జామ్జామ్‌లో ఉన్న పౌరుల శిబిరాలపై ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలు శుక్రవారం దాడులు చేశాయి. ఈ దాడుల్లో 114 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో తొమ్మిది మంది రిలీఫ్‌ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే 2023లో సుడాన్ ఆర్మీ చీఫ్, RSF మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇప్పటికి SAF, RSF మధ్య వార్ జరుగుతోంది. 

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

Advertisment
Advertisment
Advertisment