ISRO : అంతరిక్షంలో మరోసారి సత్తా చాటనున్న భారత్.. రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలు

మరో 14 నెలల్లో దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నామని ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) ప్రకటన చేసింది. ఇందులో ఏడు గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించినవి ఉన్నాయని.. స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు సంస్థల ప్రయోగాలున్నాయని చెప్పింది.

New Update
ISRO : అంతరిక్షంలో మరోసారి సత్తా చాటనున్న భారత్.. రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలు

Space Regulator In Space Release Plans : అంతరిక్ష రంగంలో భారత్‌ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. రాబోయే మరో 14 నెలల్లో దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నామని.. ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌)(In-Space) ప్రకటన చేసింది. ఈ మేరకు తాజాగా సమీకృత ప్రయోగ మోనిఫెస్టోను విడుదల చేసింది. వచ్చే 14 నెలల్లో చేపట్టబోయే ప్రయోగాల్లో గగన్‌యాన్‌ ప్రాజెక్టు(Gaganyaan Project) కు సంబంధించి ఏడు ఉన్నట్లు అందులో తెలిపింది. అలాగే స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలు కూడా ఏడు ఉన్నాయని పేర్కొంది.

Also Read : ఉత్తరఖాండ్‌లో అక్రమ మదర్సా, మసీదు కూల్చివేత.. చెలరేగిన అల్లర్లు.. నలుగురు మృతి

అయితే వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ వంటి పలు సేవల కోసం తయారుచేసిన 'ఇన్‌శాట్‌-3 డీఎస్'(INSAT-3 DS) అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14(GSLV-F14) ప్రయోగాన్ని.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఆర్థిక ఏడాదిలోనే చేపట్టనుంది. మార్చి నెలలో ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3’ మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇక ఇస్రో వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’.. నాలుగు పీఎస్‌ఎల్‌వీ, రెండు ఎస్‌ఎస్‌ఎల్‌వీ, ఒక ఎల్‌వీఎం-3 మిషన్‌ను చేపట్టాలని యోచిస్తున్నట్లు ఇన్‌-స్పేస్‌ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది.

Also Read: భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా

Advertisment
Advertisment
తాజా కథనాలు