సౌత్ ఆఫ్రికా టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. అన్నిరకాలుగా భారత జట్టుకు గట్టిపోటీని ఇచ్చింది. చివర వరకు పట్టువదలకుండా ఆడి విశ్వవిజేతలకు తాము ఏ మాత్రం తీసిపోమని చాటి చెప్పింది.
South Africa Team :టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలవడం అయితే టీమ్ ఇండియా (Team India) గెలిచింది కానీ మనసులను మాత్రం గెలిచింది దక్షిణాఫ్రికా జట్టే. టోర్నీ మొదలై దగ్గర నుంచీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వచ్చిన ప్రొటీస్ టీమ్ చివరి ఫైనల్ మ్యాచ్‌లో కూడా అదే స్పిరిట్‌తో ఆడింది. దాదాపు గెలవాల్సిన మ్యాచ్ చివర్లో వికెట్లు పోగొట్టుకోవడం వలన ఓడిపోయింది. టీమ్ ఇండియా కేవలం 8 పరుగుల తేడాతోనే విజయం సాధించింది అంటే అర్ధం చేసుకోవచ్చును సౌత్ ఆఫ్రికా జట్టు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందో.
అన్ని రకాలుగా బాగా ఆడింది...
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. అన్నింటిలోనూ సమానంగా రాణించింది ప్రోటీస్ టీమ్. భారత ఆటగాళ్ళ వికెట్లను టకటకా తీస్తూ వారి మీద ఒత్తిడిని పెంచడండో బౌలర్లు ఫుల్ సక్సెస్ అయ్యారు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటంగ్ కు దిగిన బ్యాటర్లు కూడా విజృంభించేశారు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిపోయారు. మొదటి రెండు వికెట్లు చాలా తొందరగా కోల్పోయినా ఎక్కడా తడబడలేదు. క్లాసెన్ అయితే చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లో 52 రన్స్ చేశాడు. ఒకానొక టైమ్‌లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచేస్తుంది అన కూడా అనిపించింది.చివర్లో వికెట్లను కాపాడుకోవడంలో విఫలమవ్వడంతో మ్యాచ్‌ను ఓడిపోవాల్సి వచ్చింది. అందుకే విశ్వ విజేతగా దక్షిణాఫ్రికా టీమ్ నిలవకపోయినా... క్రికెట్ (Cricket) అభిమానుల మనసులను మాత్రం గెలుచుకుంది.
🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది.
Google Photograph: (Google )
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అనేక కంపెనీలు తమపై ఆర్థిక భారాన్ని దించుకోవడానికి ఒకేసారి వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ.. వందలాది మందిపై వేటు వేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మందిని గురువారం ఒకేసారి ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కరెక్టుగా ఎంత మందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే గూగుల్ ఇంత పెద్ద మొత్తం లేఆఫ్స్ ఎందుకు విధించిందో అనే విషయాలు గురించి తెలుసుకుందాం.
ఏప్రిల్ 10న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఒకేసారి వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త తాజాగా వెలుగులోకి రాగా.. కరెక్టుగా ఎంత మంది ఉద్యోగాలు పోయాయనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై మాత్రం ఈ లే ఆఫ్‌ల ప్రభావం పడినట్లు తెలుస్తుంది. జనవరి లో గూగుల్ తన ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించి.. వెంటనే రెండు నెలలకే కోతలు విధించడంతో అంతా షాక్ అవుతున్నారు.
ముఖ్యంగా 2024 డిసెంబర్ నెలలో కూడా గూగుల్ సంస్థ 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2023 జనవరి నెలలో మొత్తంగా 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నట్లు అనేక వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత్వం వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికా ప్రతీకార సుంకాల యుద్ధం, మాంద్యం భయాలు, లాభాలు పూర్తిగా క్షీణించిపోవడం, ఏఐ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల.. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు విధిస్తున్నట్లు తెలుస్తుంది.
ఒక్క గూగుల్ సంస్థనే కాకుండా అనేక కంపెనీలు పలు కారణాలు చెబుతూ.. వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. 2025వ సంవత్సరంలోనే సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27 వేల 762 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వై వెబ్‌సైట్ వెల్లడించింది. 2024లో సుమారు 549 కంపెనీలు లక్షా 52 వేల 472 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అలాగే అంతకు ముందు 2023లో వెయ్యి 193 కంపెనీలు.. 2 లక్షల 64 వేల 220 మంది ఉద్యోగాలకు కోత విధించినట్లు స్పష్టం చేసింది.
మరో ప్రాణం తీసిన పరువు హత్య.. వేరే కులస్థుడిని ప్రేమిస్తుందని తల్లి ఏం చేసిందంటే?
గిరిజన యువకుడిని ప్రేమిస్తుందని తల్లి కూతురిని చంపిన దారుణ ఘటన తిరుపతిలో జరిగింది. మైనర్ బాలిక ఓ యువకుడితో గర్భం దాల్చగా.. తల్లి పోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకి పంపించింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ మళ్లీ కలవడంతో తల్లి కూతురిని చంపేసింది.
రామ్ చరణ్ 'కాంపా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. మిలీనియల్స్, జెన్ Zను లక్ష్యంగా చేసుకొని ఐపీఎల్ సమయంలో ‘కాంపా వాలి జిద్’ ప్రచార చిత్రం విడుదల కానుంది. ఇది కాంపా బ్రాండ్ విస్తరణలో కీలక అడుగు కావడం విశేషం.
Ram Charan Campa AD
Apr 12, 2025 06:39 IST
Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.