South Africa: ఇదే గాలిరా బాబోయ్..కేప్‌టౌన్‌లో ప్రకృతి ప్రతాపం

సౌత్‌ ఆఫ్రికాలో జనాలు ఎగిరిపోతున్నారు. కార్లు గాల్లో లేస్తున్నాయి. ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది అక్కడ. కేప్‌టూస్‌లో వీస్తున్న బలమైన గాలులతో అక్కడ బోలెడంత ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా జరుగుతోంది.

New Update
South Africa: ఇదే గాలిరా బాబోయ్..కేప్‌టౌన్‌లో ప్రకృతి ప్రతాపం

మనుషులు గాల్లో ఎగిరిపడుతున్నారు.. కార్లు కొట్టుకుపోతున్నాయి.. భూమిపై నిలబడాలంటేనే భయం వేస్తోంది. ఇది సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ప్రస్తుత పరిస్థితి. ప్రకృతి విపత్తులను తట్టుకోవడం మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అందులో ప్రకృతి దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడమే కానీ చేసేదేమీ ఉండని పరిస్థితి ఉంటుంది. ఇంటర్నెట్‌లో కేప్‌టౌన్‌ భయానక దృశ్యాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.

కేప్‌టౌన్‌తో పాటు దాని సరిహద్దు ప్రాంతాలపై ప్రకృతి ప్రతాపం చూపుతోంది. బలమైన గాలులు ఇప్పటికే వివిధ ప్రాంతాలను ముంచెత్తాయి. ముఖ్యంగా కేప్ వైన్‌ల్యాండ్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. అక్కడ అడవుల్లో మంటలు చెలరేగాయి. వీటిలో చాలా వరకు అదుపులోకి వచ్చాయి. మరోవైపు అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాలలో రోడ్డు మార్గాల నుంచి శిధిలాలు, కొమ్మలను తొలగిస్తున్నారు.

తీవ్రమైన వాతావరణం ప్రతికూల తుఫానుకు కారణమయ్యే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా వెదర్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరించింది.ఓడరేవు కార్యకలాపాలకు ఇప్పటికే అంతరాయం కలిగింది. పశ్చిమ కేప్‌లో బలమైన గాలులు , భారీ వర్షం పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నిజానికి గత సెప్టెంబరులో తుఫాను దక్షిణాఫ్రికాను ముంచెత్తింది. 9.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. తీరప్రాంత ప్రావిన్సులు విస్తృతంగా వరదలను చవిచూశాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు