Sonia Gandhi: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మద్దతిచ్చారని.. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది కొనసాగేలా కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

New Update
Sonia Gandhi: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వలో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు మద్దతిచ్చారని.. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగేలా పార్టీ నేతలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

Also Read: రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన వాయిదా

' ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రజలు మనవైపే ఉన్నారు. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నేతలు సిద్ధం కావాలి. అందరు కృషి చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో లాగే ఫలితాలు రావొచ్చు. అతినమ్మకం కూడా పనికిరాదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ కోల్పోయింది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ప్రజలను విభజిస్తూ శత్రుత్వాన్ని పెంచుతోందని' సోనియా గాంధీఅన్నారు. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కూడా కేంద్రం.. రైతులను, యువతను పూర్తిగా విస్మరించిందని ఆగ్రం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా త్వరలో జమ్మూ కశ్మీర్, హర్యానా , మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ

Advertisment
Advertisment
తాజా కథనాలు