Smoking: సిగరెట్‌ తాగితే మెదడు పనిచేయడం మానేస్తుందా?

ధూమపానం వలన ఊపిరితిత్తులతో పాటు మెదడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేసేవారి మెదడు మరింత తగ్గిపోతుందని, వృద్ధుల్లా మారిపోతారని, మెదడుపై కూడా శాశ్వత ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

New Update
Smoking: సిగరెట్‌ తాగితే మెదడు పనిచేయడం మానేస్తుందా?

Smoking: ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది ఊపిరితిత్తులతో పాటు మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ధూమపానం చేసేవారికి త్వరగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అంతేకాకుండా ధూమపానం చేసేవారి మెదడు కుంచించుకుపోతుందని చెబుతున్నారు. పొగతాగడం వల్ల గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం పడడమే కాకుండా మెదడుపై కూడా శాశ్వత ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

మెదడు ముడుచుకుపోతుంది:

  • వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల పరిశోధన ప్రకారం ధూమపానం చేసేవారి జ్ఞాపకశక్తి త్వరగా పోతుందని, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ధూమపానం చేసేవారి మెదడు కుంచించుకుపోతుందని, అసలు ఆకృతికి తిరిగి రాదని అంటున్నారు. సిగరెట్‌ తాగడం మానేయడం వల్ల మెదడు కణజాలం మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. సాధారణంగా మనిషి మెదడు వయసుతో పాటు దాని పరిణామం తగ్గుతూ ఉంటుంది. కానీ ధూమపానం చేసేవారి మెదడు మరింత తగ్గిపోతుందని, వృద్ధుల్లా మారిపోతారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

32,094 మందిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు:

  • ఈ పరిశోధనలో వివిధ వయసుల 32,094 మంది మెదడులను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ధూమపానం చేస్తే అతని మెదడు పరిమాణం అంత చిన్నదిగా ఉంటుందని నిర్థారించారు. అంతేకాకుండా ఈ-సిగరెట్‌ల దీర్ఘకాలిక వినియోగం కూడా మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఈ-సిగరెట్ వల్ల శ్వాస సమస్యలు:

  • ఇటీవల యువతలో ఈ-సిగరెట్ల వినియోగం బాగా పెరిగింది. ఈ-సిగరెట్‌ల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిలో 900 నుంచి 2000 రసాయనాలు ఉంటాయని, ఇవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా చేరి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: గర్భిణీలు ఆఫీసుకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: షుగర్‌ను కంట్రోల్‌ చేసే సూపర్‌ డ్రింక్స్‌..ఇంట్లోనే సులభంగా తయారీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pooja Hegde: ‘రెట్రో’ మూవీపై బుట్టబొమ్మ వైరల్ పోస్ట్..

సూర్య, పూజా హెగ్డే జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెట్రో’ మూవీ మే 1న తమిళ, తెలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే తాజాగా పూజ ఈ మూవీకి డబ్బింగ్ ప్రారంభించినట్లు తెలిపిన పోస్టు వైరల్ అవుతూ సినిమాపై హైప్ పెంచేసింది.

New Update
Retro Movie Pooja Hegde

Retro Movie Pooja Hegde

Pooja Hegde: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ ‘రెట్రో’(Retro) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాక్షన్ డ్రామాను ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. 1980ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని రూపొందుతున్న ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

Also Read: ఇకపై అంతా చీకట్లోనే.. షాకిచ్చిన్న నేషనల్ క్రష్..

మే 1న 'రెట్రో' గ్రాండ్ రిలీజ్

ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమాను మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో పాన్ రీజినల్ రీతిలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకుల నుండి భారీ స్పందనను రాబట్టాయి. దీంతో 'రెట్రో'పై ఆడియన్స్ అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా సూర్య- పూజా హెగ్డే కాంబినేషన్‌ చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఇక తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రెట్రో మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ అప్‌డేట్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది.

pooja retro dubbing
pooja retro dubbing

 

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

సూర్య స్టైల్, కార్తీక్ సుబ్బరాజ్ విజన్, పూజా హెగ్డే గ్లామర్ మేళవింపుతో 'రెట్రో' ఈ సమ్మర్‌లో ఓ మోస్ట్‌వాంటెడ్ మూవీగా మారిందనడంలో సందేహమే లేదు.

#Retro #surya #pooja hegde
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు