Less Sleeping : ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా?

5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల హై బీపీ, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. తక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులు అధిక రక్తపోటు, స్థూలకాయం, శారీరక దృఢత్వం కోల్పోతారు.

New Update
Less Sleeping : ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా?

Less Than 5 Hours Sleep : ప్రతి మనిషి(Every Human) కి నిద్ర చాలా అవసరం. నిద్ర(Sleep) లో కూడా మన మెదడు పని చేస్తుంది. కాబట్టి శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. మనం ఎప్పుడు, ఎంతసేపు నిద్రపోతాం అనేది కూడా ముఖ్యం. నిద్ర అనేది వ్యక్తి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. పెద్దల కంటే పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం. నవజాత శిశువులకు రోజుకు 18 గంటల నిద్ర అవసరం. ఒక సంవత్సరం వయస్సు ఉన్న పిల్లలకు 14 గంటలు సరిపోతుంది. పెద్దలకు కనీసం 5 గంటల నిద్ర అవసరం.

శరీరంపై ప్రతికూల ప్రభావం:

  • మారిన జీవనశైలి(Human Life Style) కారణంగా చాలా మంది సరిగా నిద్రపోరు. 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి(Insomnia) వల్ల హై బీపీ, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. రాత్రి 5 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులు అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, శారీరక దృఢత్వం కోల్పోతారని అంటున్నారు. నిద్ర లేకపోవడం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, కాబట్టి తగినంత నిద్రపోవడం మంచిదని చెబుతున్నారు. బాగా నిద్రపోతే శక్తివంతంగా ఉంటారని అంటున్నారు.

డిప్రెషన్‌కు కారణం:

  • రోజూ ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతే.. వారు బరువు పెరిగే(Weight Gain) అవకాశం కూడా ఉందట. నిద్రలేమి వల్ల వచ్చే హార్మోన్ల మార్పులే బరువు పెరగడానికి ప్రధానకారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీరోజూ తగినంత నిద్రపోకపోతే ఇది రోగనిరోధక వ్యవస్థ(Immunity System) పై ప్రభావం చూపుతుంది.ఈ రోగ నిరోధక శక్తి సరిగ్గా లేకపోతే అనేక వ్యాధులుతోపాటు మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మెదడు పనితీరు తగ్గుతుంది. శ్రద్ధ, స్పష్టత, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, ​ కోపం, మానసిక రుగ్మత, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక ఆరోగ్య సమస్యలన్ని వస్తాయి. అంతేకాదు నిద్రలేమి కూడా డిప్రెషన్‌కు కారణం అవుతుంది. ముందుగానే జాగ్రత్త తీసుకోకపోతే హెల్త్‌కి మరింత పెద్ద సమస్య అవుతుందటున్నారు.

ఇది కూడా చదవండి: ఈ విషయం తెలిస్తే సోఫాలో అస్సలు పడుకోరు

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు