Telangana : తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. వాళ్లకే ఛాన్స్ ఉందా..?

తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

New Update
Telangana : తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ..  వాళ్లకే ఛాన్స్ ఉందా..?

BRS Party Telangana : తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ(BRS Party) పరాజయంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రానుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy), కడియం శ్రీహరి (Kadiyam Srihari), పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) అలాగే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayan Reddy) ఈ ఎన్నికల్లో గెలిచారు. అయితే వీళ్లు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామ చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఏకంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అంతేకాదు ప్రస్తుతం గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపితే ఆరు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రేపు(గురువారం) ఎల్బీస్టేడియంలో రేవంత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎమ్మెల్సీగా రేవంత్‌ ఎవరికి అవకాశం ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఎమ్మెల్సీ రేసులో షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్‌తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సీపీఐ నేతలకు కూడా అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది.

Also read: 70 ఏళ్ళుగా వారు దానికి అలవాటు పడిపోయారు, జాగ్రత్త..పీఎం మోడీ పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు