UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

ఉగాది పండగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పచ్చడి. జీవితంలో ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యం భావాలకు ప్రతీకగా ఉగాది రోజు ఈ షడ్రుచులు కూడిన పచ్చడిని తాగుతారు. ఉగాది పచ్చడిని క్షణాల్లో తయారు చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

author-image
By Archana
New Update
ugadi pachadi

ugadi pachadi

UGADI 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం..  ఉగాది పండగతో  తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది. ఈ ఏడాది మార్చి 30 అంటే ఆదివారం  నుంచి ‘శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం’ ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజునే ఉగాది పండుగను జరుపుకుంటారు.  తెలుగువారు జరుపుకునే మొట్టమొదటి పండగ ఇది. 

Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

అయితే ఉగాది పండగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పచ్చడి. తీపి, కారం, ఉప్పు, వగరు, పులుపు, చేదు రుచుల కలయికతో ఈ పచ్చడిని తయారు చేస్తారు.  జీవితంలో ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యం భావాలకు ప్రతీకగా ఉగాది రోజు ఈ షడ్రుచులు కూడిన పచ్చడిని తాగుతారు. 
ఉగాది పచ్చడిని ఈజీగా క్షణాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. 

కావాల్సిన పదార్థాలు 

  • వేప పువ్వు-   పావు కప్పు
  • కారం- అరచెంచా 
  • మామిడి కాయ - 1
  • చింతపండు- 100 గ్రాములు
  • బెల్లం -100 గ్రాములు
  • ఉప్పు సరిపడా

ఇది కూడా చూడండి: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

తయారీ విధానం.. 

  • ముందుగా చింతపండును కడిగి.. ఒక కప్పు నీటిలో నానబెట్టండి. 
  • అది నానుతూ ఉండగా.. మామిడికాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే బెల్లాన్ని పొడి చేసి పెట్టుకోండి. 
  • ఇప్పుడు చింతపండు గుజ్జును తీసి.. దానికి మరో రెండు కప్పుల నీళ్ళు కలపండి. 
  • ఆ తర్వాత అందులో తరిగిన మామిడి కాయ ముక్కలు, బెల్లం పొడి, వేప పువ్వు, కారం, ఉప్పు వేసి కలపండి. అంతే చిటికెలో ఉగాది పచ్చడి రెడీ. నీటిని మీకు ఎంత మేరకు కావాలో అంత కలుపుకోవచ్చు.  

latest-news | ugadi-pachadi 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment