Anger : కోపాన్ని అదుపు చేయడం ఎలా?.. ఒత్తిడిని తగ్గించే సింపుల్ చిట్కాలు కోపం, ఆవేశాన్ని తగ్గించుకోకపోతే అధిక రక్తపోటు, ఆందోళన వంటి శారీరక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. కోపం తగ్గించుకోవాలంటే లోతుగా శ్వాస తీసుకుని వదలాలని, ఇలా రోజుకు 3 సార్లు 5 నుంచి 10 నిమిషాల పాటు చేస్తే కోపం తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 07 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Anger : కోపం, ఆవేశాన్ని(Rage) తగ్గించుకోకపోతే అధిక రక్తపోటు(Blood Pleasure), ఆందోళన వంటి శారీరక సమస్యలకు(Physical Problems) దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. కొప్పాన్ని తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. లోతైన శ్వాస తీసుకోండి: కోపం(Anger) వచ్చినప్పుడు శ్వాసను సరిగ్గా పట్టించుకోరు. శ్వాస మిమ్మల్ని మరింత దూకుడుగా కనిపించేలా చేస్తుంది. కోపం తగ్గించుకోవాలంటే లోతుగా శ్వాస తీసుకుని వదలాలని, ఇలా చేయడం వల్ల కోపం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రశాంతంగా శ్వాస తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా రోజుకు 3 సార్లు 5 నుంచి 10 నిమిషాల పాటు చేస్తే కోపం తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. చిత్రాన్ని గీయండి: ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో నిమగ్నమవ్వడం వల్ల కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెదడు(Brain) ను శాంతపరచడానికి ఏదైనా చిత్రాన్ని గీయడానికి ప్రయత్నించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. యోగా చేయాలి: కోపంగా ఉన్నప్పుడు యోగా(Yoga) చేయడం వల్ల శరీరాన్ని రిలాక్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కండరాలు కూడా శాంతింపబడతాయని నిపుణులు అంటున్నారు. చిన్నగా నడవడం లేదా డ్యాన్స్ చేయడం వల్ల కూడా కోపం తగ్గుతుందని చెబుతున్నారు. కోపంతో మాట్లాడే ముందు ఏం చేయాలి? కోపంలో మీరు చేయవలసింది ప్రశాంతంగా ఉండటమే. అంటే మాట్లాడే ముందు ఆలోచించడం. నోరు మెదపకుండా సంబంధిత వ్యక్తులకు నెమ్మదిగా సమాధానం చెప్పాలి. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని గందరగోళ విషయాలు మిమ్మల్ని మరింత కలత చెందేలా చేస్తాయి. కొన్ని మార్చలేని విషయాల గురించి బాధపడొద్దని, అలాగే అవతలి వ్యక్తిపై ద్వేషాన్ని పెంచుకోవద్దని నిపుణులు అంటున్నారు. కోపం తెప్పించిన వారి గురించి కొన్ని గంటలపాటు ఆలోచించడం మానేయాలని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: సాక్సులు వేసుకుని పడుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #anger #simple-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి