IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్ కొరత తీరనుందా? బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ బౌలింగ్‌లోనూ రాణించాలని తహతహలాడుతున్నాడు. బౌలింగ్‌పై ఫోకస్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. ఓవైపు ఆల్‌రౌండర్ కొరతతో ఇబ్బంది పడుతున్న టీమిండియాకు 3డీ ప్లేయర్ అవసరం ఎంతైన ఉంది. By Trinath 07 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి జట్టులో ఎంతమంది ఆల్‌రౌండర్లు ఉంటే అంత ప్రయోజనం. తక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉంటే ఏదో ఒక రోజు బోల్తాపడక తప్పదు. వరల్డ్‌కప్ ఫైనల్‌లో టీమిండియా ఫెయిల్యూర్‌కు ఇది కూడా ఒక కారణం. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పడడంతో టీమిండియా సూర్యకుమార్(SuryaKumar Yadav)ను ఆడించింది. అతను బ్యాటర్ మాత్రమే. దీంతో ఆరో బౌలర్ లేకుండానే ఫైనల్ ఆడింది. అంటే 5 బౌలర్లతోనే బౌలింగ్ వేయించుకోవాలి. ఒక్క బౌలర్ ఫ్లాప్ అయినా మరో బౌలర్ లేడు. ఇదే టీమిండియా కొంపముంచింది. ఈ సమస్యను సాల్వ్ చేసుకోకపోతే భవిష్యత్‌లోనూ వరల్డ్‌కప్ ఫైనల్ సీన్లే రిపీట్ అవుతాయి. యువరాజ్ సింగ్(Yuvraj Singh) తర్వాత భారత్‌కు ఆ స్థాయి ఆల్‌రౌండర్ దొరకలేదు. ఆ మధ్య 3D అంటూ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు లేపే ప్రయత్నం చేశారు కానీ.. అతని ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో పక్కన పెట్టారు. నాకు బౌలింగ్ చేయాలని ఉంది: టీమిండియా మిడిలార్డర్‌లో నంబర్-4 బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) సెటైనట్టే కనిపిస్తున్నాడు. గాయం తర్వాత కోలుకోని జట్టులోకి వచ్చిన అయ్యర్ వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు. 500కు పైగా పరుగులు సాధించాడు. దీంతో విమర్శలకు చెక్ పడింది. ఇక తాజాగా తన మనసులో మాట బయట పెట్టుకున్నాడు. తనకు బౌలింగ్ వేయలని ఉందని చెప్పాడు. అయితే అయ్యర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 45 బంతులు మాత్రమే బౌలింగ్ చేసాడు. వికెట్లు ఏమీ పడగొట్టలేదు. 43 పరుగులు ఇచ్చాడు. అయితే.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం 10 వికెట్లు ఉన్నాయి. డిసెంబర్ 3న బెంగుళూరులో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన తర్వాత, అయ్యర్ తన బౌలింగ్ నైపుణ్యాలను వెలికితీసే కోరికను వ్యక్తం చేశాడు. అటు బ్యాటింగ్‌లోనూ అయ్యర్ సత్తా చాటాడు. ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 37 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ భారత్‌ను 160/8కి నిలబెట్టింది. సిరీస్‌లో మొత్తంగా, అతను మూడు మ్యాచ్‌ల్లో 21.67 సగటుతో 65 పరుగులు చేశాడు. 28 ఏళ్ల అయ్యర్ కీలకమైన క్యాచ్‌లను పట్టుకున్నాడు. దీంతో ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఇలా బ్యాటింగ్, ఫీల్డింగ్ రాణించిన అయ్యర్ బౌలింగ్‌లోనూ రాణించాలని తహతహలాడుతున్నాడు. టీమిండియాకు ఆరో బౌలర్ కొరత ఇప్పటికీ వేధిస్తూనే ఉండడంతో మంచి ఆల్‌రౌండర్ కావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. Also Read: ఆ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడు.. లెజెండరీ ప్లేయర్ కామెంట్స్ WATCH: #cricket #indian-team #shreyas-iyer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి