Cricket:మరీ ఇంత గర్వం పనికిరాదు కంగారూలూ.. ప్రపంచ కప్ ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శనతో కప్ ను సొంతం చేసుకున్నారు. కానీ దాని తర్వాత వారి ప్రవర్తనే అస్సలు బాలేదు. మొన్న కప్ మీద కాళ్ళు పెట్టాడు మిచెల్ ఇప్పుడు టీమ్ ఇండియాను అవమానిస్తూ పెట్టిన పోస్ట్ కు కమిన్స్, మాక్స్ లైక్ లు కొట్టారు. By Manogna alamuru 25 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఆరుసార్లు విశ్వవిజేతలే కావచ్చు...టీమ్ ఎఫర్ట్ తో వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవచ్చు. దీనికి అందరూ వాళ్ళను మెచ్చుకున్నారు. టీమ్ ఇండియాను భారత్ లోనే ఓడించినా ఎవ్వరూ ఒక్క మాట అనలేదు సరికదా..చాలా బాగా పొగిడారు కూడా. కానీ వాళ్ళకు మాత్రం గర్వం బాగా నెత్తికెక్కింది. వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచీ ఏదొ ఒకటి చేస్తూనే ఉన్నారు. వరల్డ్‌కప్ ట్రోఫీ మీద కాళ్లు వేసి మిచెల్ మార్ష్ ఇచ్చిన ఫోజు ఇంకా మరిచిపోకముందే.. టీమిండియా క్రికెటర్లను అవమానించేలా ఆసీస్ క్రికెటర్లు మరో పనిచేశారు. ఫైనల్‌లో కంగారూలు గెలిచిన తర్వాత భారత క్రికెటర్లను అవమానించేలా ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఒకటి ఓ పోస్ట్ చేసింది. దానికి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్ వంటి క్రికెటర్లు లైక్ కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. Also Read:తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ. సౌత్ ఆస్ట్రేలియన్ మ్యాన్ గివ్స్ బర్త్ టు వరల్డ్ రికార్డ్ 11 సన్స్ అంటూ భారత క్రికెటర్లను చిన్న పిల్లలను చేస్తూ చాలా ఎగతాళిగా ఆస్ట్రియన్ మీడియా పోస్ట్ పెట్టింది. సాధారణంగా దీన్ని ఎవరైనా ఖండించాలి. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లు. కానీ కంగారూల కెప్టెన్ ప్యాట్ కమిన్, మిచెల్ లు మర్చిపోయినట్టున్నారు. లేదా టీమ్ ఇండియాను ఓడించామన్న పొగరో తెలియదు కానీ ఆ పోస్ట్ కు లైక్ లు కొట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పోస్ట్ వైరల్ అయ్యాక కమిన్స్ మళ్ళీ అన్ లైక్ చేశాడు. దీని మీద ఇండియన్స్ మండిపడిపోతున్నారు. ఎంత ప్రపంచకప్ గెలిస్తే మాత్రం మరీ ఇంతలా మిడిసిపడాలా అంటూ తిట్టిపోస్తున్నారు. కమిన్స్, మ్యాక్స్ వెల్ లను ఐపీఎల్ లో ఆడకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. pic.twitter.com/bbHWYA2rcB — Out Of Context Cricket (@GemsOfCricket) November 24, 2023 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ టీమ్ ఓడిపోయినంత మాత్రాన భారత జట్టు ఏమీ తక్కువు ఆడలేదు. టోర్నీ మొదటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడుతూ వచ్చింది. భారత కెప్టెన్ ప్రతీ మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. విరాట్ మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. ఇవేవీ ఆస్ట్రేలియన్ మీడియాకు కనిపించలేదు కాబోలు..చేతికి వచ్చినట్టు రాస్తూ తమ పైత్యాన్ని చూపించుకుంది. దాన్ని వ్యతిరేకించాల్సిన క్రికెటర్లు సైతం లైకులు కొడుతూ తమ గర్వాన్ని , పొగరునీ బయటపెట్టుకున్నారు. కానీ ఒక్క సంగతి మర్చిపోయారు... ఇదే భారత కుర్రాళ్ళ చేతిలో మొన్న టీ20లో ఈ మహావీరులు ఓడిపోయారని... ఇతంటితో క్రికెట్ అయిపోలేదు, ఆగిపోలేదని. #cricket #india #australia #post మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి