Sivaji:మెగా ఫ్యామిలీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Sivaji : బిగ్ బాస్ 7 షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న శివాజీ #90s అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

New Update
Sivaji:మెగా ఫ్యామిలీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Sivaji:మైండ్ గేమ్ తో బిగ్ బాస్ (Biggboss) సీజన్ 7 షోతో అత్యంత భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాస్టర్ మైండ్ శివాజీ ఇప్పుడు పూర్తి ఫోకస్ నటన పైనే పెట్టాడు. అయితే .. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ ఇప్పుడు #90s అనే వెబ్ సిరీస్ (webseries)చేస్తున్నారు.ఈ వెబ్ సిరీష్ ప్రమోషన్స్ లో భాగంగా (Megafamily)మెగా ఫ్యామిలీ పై సంచలనం వ్యాఖ్యలు చేయడం తో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉందని ఆ కుటుంబానికి ఉన్న ఫ్యాన్ బేస్ మరే కుటుంబానికి లేదని శివాజీ తెలిపారు.

మెగా ఫ్యామిలీ తలచుకుంటే సీఎం కావడం పెద్ద కష్టమేమీ కాదు

మెగా ఫ్యామిలీ తలచుకుంటే సీఎం కావడం పెద్ద కష్టమేమీ కాదని శివాజీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. . ఎక్కడో చిన్న లోపం ఉందని ఆ లోపాన్ని సరి చేసుకుంటే చాలని ఆయన కామెంట్లు చేశారు. ఇంకా.. అప్పట్లో పాలిటిక్స్ ఆయన మాట్లాడిన తూటాల్లాంటి మాటలు రాజకీయాల్లో హీట్ పుట్టించిన మాట వాస్తవమే. అయితే రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ ..ప్రజల్లో ప్రశ్నించే తత్వం పోయిందని,, ఓపిక నశించిందని ..వాళ్ళను మభ్యపెట్టే ధోరణిలో రాజకీయ నాయకులు మారారని అన్నారు. ప్రజల గొంతుకగా ఉంటానని, యువత కోసం ప్రత్యేక హోదా అడిగాననని ,ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో లేనని నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని ఒంటరిగా ఎన్నాళ్లు పోరాడగలనని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల గురించి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో అందుకు సంబంధించిన ప్రశ్నలు అడగాలని అన్నారు.నేను నమ్ముకున్న నటనను వదిలిపెట్టేదేలేదని,ఆ క్రమంలోనే ఇప్పుడు ఈ సిరీస్ చేస్తున్నానని అన్నారు.

ALSO READ:Sarkaaru Noukari Review: సర్కార్ నౌకరి మూవీతో సింగర్ సునీత కొడుకు హీరోగా మెప్పించాడా ?

ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తోన్న తరుణంలో శివాజీ వ్యాఖ్యలు

బిగ్ బాస్ హౌస్ లో (Pallavi prasanth)పల్లవి ప్రశాంత్ విన్ అయ్యేందుకు శివాజీ ప్రధాన వ్యూహ కర్తగా పనిచేశారని అందరికి తెల్సిందే. ఒకప్పుడు హిలేరియస్ కామెడీతో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన శివాజీ బిగ్ బాస్ 7 తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం విశేషం. బిగ్ బాస్ సీజన్ 7 నెక్స్ట్ లెవల్లో సక్సెస్ కావడానికి శివాజీ కారణమని ఖచ్చితంగా చెప్పొచ్చు. సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే సమయంలో (Megafamily) మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తావిస్తూ శివాజీ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండగా 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సిన తరుణంలో శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

ALSO READ:Prabhas:ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తా – ప్రభాస్ పోస్ట్ వైరల్!!

Advertisment
Advertisment
తాజా కథనాలు